లాక్ డౌన్ టైంలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. అప్పటికే ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న చాలా సినిమాలను ఓటీటీలకు ఇచ్చేశారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం పట్టుబట్టి థియేట్రికల్ రిలీజ్ కోసం ఆగాయి. అందులో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఒకటి. ఈ చిన్న సినిమాను పది నెలలకు పైగా ఆపి ఈ వారాంతంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.
ఐతే సినిమాకు ఆశించినంత టాక్ మాత్రం రాలేదు. చిత్ర బృందం ప్రచారం చేసుకున్నట్లు ఇందులో సూపర్ హిట్టయిన ‘నీలి నీలి ఆకాశం’ పాట అంత బాగా సినిమా లేదు. యావరేజ్ అన్న వాళ్లు కూడా కనిపించడం లేదు. ఐతే టాక్‌తో సంబంధం లేకుండా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’కు మంచి ఓపెనింగ్స్ మాత్రం వచ్చాయి. తొలి రోజు 1.7 కోట్ల రూపాయల దాకా షేర్ వచ్చిందట ఈ చిత్రానికి.
నైజాంలో 65 లక్షలు, ఆంధ్రాలో 80 లక్షలు, రాయలసీమలో రూ.25 లక్షల షేర్ రావడం విశేషం. ఈ సినిమా స్థాయికి ఇది పెద్ద మొత్తమే. సంక్రాంతి సినిమా ‘క్రాక్’ జోరు కొనసాగుతుండగా.. గత వారం వచ్చిన ‘బంగారు బుల్లోడు’ దాని ధాటికి ఏమాత్రం నిలబడలేకపోయింది. మినిమం ఓపెనింగ్స్ రాలేదు ఆ చిత్రానికి. కానీ ‘30 రోజుల్లో..’కు మాత్రం తొలి రోజు ఉన్నంతలో మంచి వసూళ్లే వచ్చాయి. థియేటర్ల దగ్గర కళ కనిపించింది.
సినిమాకు ఈ మాత్రం బజ్ వచ్చి ప్రేక్షకులు థియేటర్ల వైపు కదిలారంటే అందులో మేజర్ క్రెడిట్ గాయకుడు సిద్ శ్రీరామ్‌కే ఇవ్వాలి. అతను పాడిన ‘నీలి నీలి ఆకాశం’ ఎంతగా పాపులర్ అయిందో, యూట్యూబ్‌లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ పాట వల్లే ఈ సినిమా గురించి ప్రేక్షకులకు తెలిసింది. ఇప్పుడు ఈ సినిమా చూద్దామని ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారన్నా ఆ పాటే కారణం. ఐతే ఈ పాట ఓపెనింగ్స్‌కు ఉపయోగపడింది కానీ.. సినిమాను మాత్రం నిలబెట్టడం కష్టమే.
This post was last modified on %s = human-readable time difference 6:47 pm
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…
తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు…
కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్టవడం!.…
పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్…
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…