మాస్ రాజాకు ఇంతకంటే లక్కీ టైం ఇప్పటిదాకా లేదేమో. ఆయన కొత్త సినిమా ‘క్రాక్’కు బాక్సాఫీస్ దగ్గర మామూలుగా కలిసి రావట్లేదు. సంక్రాంతికి ‘క్రాక్’తో పాటు ఇంకో మూడు సినిమాలు రిలీజయ్యాయి. ఆ మూడింటి మీదా మంచి అంచనాలే ఉన్నాయి. వాటికి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత సినిమాలు నిలబడలేదు. మిగతా మూడు సినిమాలు రావడానికి ముందు సోలోగా బాక్సాఫీస్‌ను రూల్ చేసింది ‘క్రాక్’.
సంక్రాంతి సమయంలో ఆ మూడు సినిమాల నుంచి పోటీ ఎదుర్కొంది కానీ.. పండుగ సందడి, వీకెండ్ ముగియగానే ఆ సినిమాలు జోరు తగ్గించేశాయి. ‘క్రాక్’ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది. స్క్రీన్లు, షోలు పెంచడమే కాదు.. థియేటర్లలో ఎక్స్‌ట్రా చైర్స్ కూడా వేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ‘క్రాక్’ జోరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
రెండు వారాల తర్వాతైనా ‘క్రాక్’ జోరు తగ్గుతుందనుకుంటే అదేమీ జరగలేదు. సంక్రాంతి సీజన్ తర్వాత రిలీజవుతున్న సినిమాలన్నీ తుస్సుమనిపిస్తున్నాయి. ‘క్రాక్’కు ఏమాత్రం బ్రేక్ వేయలేకపోతున్నాయి. గత వారం వచ్చిన ‘బంగారు బుల్లోడు’ అల్లరి నరేష్ ఫ్లాప్ స్ట్రీక్‌ను కంటిన్యూ చేసింది. కనీస స్థాయిలో కూడా ఆ సినిమా ప్రభావం చూపలేదు. అసలు దాన్నుంచి ‘క్రాక్’కు కొంచెం కూడా పోటీ లేకపోయింది.
ఇక ఈ వారం వచ్చిన ప్రదీప్ మాచిరాజు సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’కు డీసెంట్ బజ్ కనిపించింది. ‘నీలి నీలి ఆకాశం’ పాట అందుక్కారణం కావచ్చు. యూత్ ఈ సినిమాపై ఆసక్తిని ప్రదర్శించారు. కానీ వారి అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలమైంది. నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో తొలి రోజు సెకండ్ షో సమయానికి సినిమా చల్లబడిపోయింది. దీంతో ‘క్రాక్’ జోరుకు ఈ వీకెండ్ కూడా బ్రేక్ పడనట్లే.
‘క్రాక్’ థియేటర్లలో మంచి కలెక్షన్ రాబడుతున్న నేపథ్యంలో ‘ఆహా’లో దాని డిజిటల్ రిలీజ్‌ను వారం వాయిదా వేశారు. కానీ ఈ వారాంతంలో ఆ సినిమా జోరు చూశాక ఇంకో వారం వాయిదా వేస్తే బాగుండని డిస్ట్రిబ్యూటర్లు అనుకుంటే ఆశ్ంచర్యం లేదు. కానీ అలా చేస్తే తమ ప్రయోజనాలకు గండి పడుతుంది కాబట్టి ‘ఆహా’ వారు అలా చేయకపోవచ్చు. ఫిబ్రవరి 5నే ఈ చిత్రాన్ని ఆహాలో స్ట్రీమ్ చేసే అవకాశముంది.
This post was last modified on January 30, 2021 2:25 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…