మోస్ట్ అవైటెడ్ టీజర్ రానే వచ్చింది. శుక్రవారం ‘ఆచార్య’ మెరుపులు చూశాం. మెగా అభిమానులకు అది గూస్ బంప్స్ ఇచ్చింది. చిరు లుక్స్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన షాట్స్, వాటిలో చిరు చురుకుదనం అన్నీ ఆకట్టుకున్నాయి. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకున్నాయి. ఐతే చివరికి ఇందులో కొత్తగా ఏముంది అని చూస్తే పెద్దగా ఏమీ కనిపించలేదు. చూడగా చూడగా ‘ఆచార్య’ టీజర్లో అసలు కొరటాల ముద్ర ఏముంది అనిపించింది. ముఖ్యంగా టీజర్‌లో యాక్షన్ పార్ట్ డామినేషన్ అందరికీ అంత రుచించలేదు. మొత్తం టీజర్ చూసి ఇది కొరటాల సినిమానా.. బోయపాటి సినిమానా అని చాలామందికి సందేహం కలిగి ఉంటే ఆశ్చర్యమేమీ లేదు.
సాధారణంగా బోయపాటి సినిమాల కథలు చాలా వరకు ఒకే తరహాలో ఉంటాయి. ఒక ప్రాంతంలో విలన్లు విచక్షణా రహితంగా మనుషుల్ని చంపుతుంటే హీరో రక్షకుడిలా అక్కడికి రావడం.. దుష్ట సంహారానికి దిగడం.. రక్తపాతం సృష్టించడం.. ఇదీ బోయపాటి సినిమాల వరస. ‘ఆచార్య’ టీజర్ చూస్తే అచ్చంగా ఇది అలాంటి కథలాగే ఉంది. కాకపోతే ధర్మస్థలి అంటూ కొంచెం డిఫరెంట్‌గా ఉండే సెటప్ ఎంచుకున్నారు. మూల కథ మాత్రం పైన చెప్పుకున్న తరహాలోనే ఉంది.
ధర్మస్థలిలో ధర్మాన్ని కాపాడుతున్న మనుషుల ప్రాణాలకు ఆపద వస్తే హీరో వచ్చి దుష్ట సంహారం చేయడం, వారికి అండగా నిలబడటమే కథలా ఉంది. ఇక టీజర్ మొత్తంలో హైలైట్ అయిందంతా వయొలెన్సే. రకరకాలుగా విలన్ బ్యాచ్ తాట తీయడం.. వారిని సంహరించడం తప్ప చిరు కొత్తగా చేసిందేమీ లేదు. కాకపోతే ఆయన లుక్, చివర్లో చెప్పిన డైలాగ్ భిన్నంగా అనిపించాయి. బోయపాటి సినిమాల్లో అయితే హీరో చాలా ఆవేశంగా ఫైనల్ పంచ్ ఇస్తాడు.
కానీ ఇక్కడ చిరు కొరటాల స్టయిల్లో సటిల్‌గా డైలాగ్ చెప్పాడు. అంతే తేడా. కొరటాల సినిమాల్లో వయొలెన్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది కానీ.. ఇందులో డోస్ మరీ ఎక్కువైందేమో అనిపిస్తోంది. కథ కూడా కొత్తగా అనిపించడం లేదు. టీజర్ వరకైతే కలిగిన ఫీలింగ్ ఇది. సినిమాలో ఇంకేదైనా కొత్తగా ట్రై చేసి తన ముద్రను చూపిస్తాడేమో చూడాలి.
This post was last modified on January 30, 2021 2:26 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…