శృంగార తారగా మలయాళ పరిశ్రమను ఒక సమయంలో ఒక ఊపు ఊపిన నటి షకీలా. ఆమె ధాటికి అక్కడి సూపర్ స్టార్లు కూడా భయపడ్డారంటే.. తన సినిమాలను బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఆమె సంచలనాలనే కథా వస్తువుగా చేసుకుని ఈ మధ్యే ‘షకీలా’ పేరుతో సినిమా తీశారు. నేరుగా తన పేరు పెట్టి, తన కథను సినిమా తీశారు అంటే.. కచ్చితంగా షకీలాకు కథ చెప్పే ఉంటారని, ఆమెకు డబ్బులు కూడా ఇచ్చి ఉంటారనే అనుకుంటాం.
ఐతే డబ్బుల సంగతి ఏమో కానీ.. కథ విషయంలో మాత్రం షకీలా ఆమోద ముద్ర పడలేదని తెలుస్తోంది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘షకీలా’ సినిమా మీద షకీలా విమర్శలు గుప్పించడమే అందుకు రుజువు. ఇంతకుముందు తీసిన ‘డర్టీ పిక్చర్’తో పాటు ఇప్పుడొచ్చిన ‘షకీలా’ సినిమాలో పెద్ద తప్పులున్నాయని.. ఆ రెండు సినిమాలనూ సరిగా తీయలేదని షకీలా వ్యాఖ్యానించింది.
ఈ రెండు సినిమాల్లోనూ సిల్క్ స్మితకు తనకు పోటీ ఉన్నట్లుగా చూపించారని.. తన వల్ల ఆమె డౌన్ అయినట్లుగా చూపించారని.. అది తప్పని షకీలా వ్యాఖ్యానించింది. నిజానికి సిల్క్ స్మిత ముందు తనది చాలా చిన్న స్థాయి అని.. ఆమె మరణానంతరం కొన్నేళ్లకు తన జోరు మొదలైందని షకీలా వ్యాఖ్యానించింది. నిజానికి షకీలాకు పోటీగా ఉన్నది అనురాధ అని ఆమె అభిప్రాయపడింది. ఇక సిల్క్ స్మితతో తన అనుభవాల గురించి చెబుతూ.. ఒక సినిమా షూటింగ్ సందర్భంలో తనను అకారణంగా ఆమె చెంపదెబ్బ కొట్టిందని.. తర్వాత తనను ఓదార్చిందని షకీలా చెప్పింది.
ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి, కుటుంబ బంధాల గురించి షకీలా మాట్లాడుతూ.. తన డబ్బులన్నీ తన కుటుంబ సభ్యులు, బంధువుల కోసమే ఖర్చు చేశానని.. వారిలో చాలామంది తనను వదిలేసి వెళ్లిపోయారని, అవమానాలకు గురి చేశారని.. ప్రస్తుతం తన దగ్గర పెద్దగా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమీ లేదని.. బతకడానికి కావాల్సిన డబ్బులు మాత్రమే ఉన్నాయని.. అందుకే ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తున్నానని.. తన వల్ల అయినంత వరకు ఇలా ఒంటరిగా బతికి తర్వాత తన అమ్మ, అక్కల దగ్గరికి వెళ్తానని షకీలా చెప్పింది.
This post was last modified on January 29, 2021 11:31 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…