కాస్త పేరున్న సినిమా ఏదైనా మొదట ప్రకటించిన రిలీజ్ డేట్‌కే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది టాలీవుడ్లో. అనిల్ రావిపూడి లాంటి కొద్దిమంది డైరెక్టర్లను మినహాయిస్తే అనుకున్న టైంకి సినిమా పూర్తి చేసి, చెప్పిన డేటుకు రిలీజ్ చేసే వాళ్లు అరుదు. ఈ ఏడాది వచ్చిన మెజారిటీ సినిమాలు రిలీజ్ డేట్‌ను మార్చుకున్నవే.
రిలీజ్ ఇంకొన్ని రోజులు ఉందనగా.. ఉన్నట్లుండి వాయిదా వేయడం మామూలైపోయింది. ఈ మధ్య ఆదర్శ కుటుంబం, భోగి లాంటి పేరున్న సినిమాలకు ఇలాగే జరిగింది. ఐతే అప్పుడప్పుడూ ఇలాంటి షాక్ ఒకటి తగలడం ప్రేక్షకులకు మామూలైపోయింది. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఒకేసారి అనేక షాక్‌లు ఇవ్వబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం నడుస్తోంది.
నవంబరు 27న రిలీజ్ కావాల్సిన సినిమాల్లో ఆల్రెడీ హైందవ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించకపోయినా.. ప్రమోషన్లు ఆపేయడం చూస్తే ఆ వార్త నిజమే అని తేలిపోయింది. ఆ స్థానంలోకి శర్వానంద్ సినిమా భోగి వచ్చేసింది. కానీ అదే రోజు రావాల్సిన రష్మిక మందన్నా మూవీ మైసా కూడా వాయిదా పడబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
మారిన సెన్సార్ నిబంధనల ప్రకారం మైసాకు ఇప్పటికే సెన్సార్ చేయించాల్సింది. కానీ కుదరలేదు. దీంతో ఈ సినిమాను ఒక వారం వాయిదా వేస్తారని అంటున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆలస్యం వల్ల డిసెంబరు 4 నుంచి నాగచైతన్య మూవీ వృషకర్మను వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. చైతూ మాత్రమే కాదు అతడి తండ్రి నాగ్ కూడా తన కొత్త సినిమా కింగ్ 100ను చెప్పిన డేట్‌కు తీసుకురావడం డౌటే అంటున్నారు.
ఇటీవల ఈ సినిమా డిసెంబరు 24 రిలీజ్‌కు ట్రాక్‌లోనే ఉన్నట్లు నాగ్ చెప్పాడు కానీ.. ఈ సినిమా కూడా కొంచెం ఆలస్యం అయ్యేలా ఉందని, క్రిస్మస్ రిలీజ్ డౌటే అని అంటున్నారు. ఒకేసారి ఇన్ని సినిమాల వాయిదా గురించి సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ నడుస్తుండడం ఆయా చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు తీవ్ర నిరాశను గురి చేస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates