మెగాస్టార్ చిరంజీవి తొలిసారి నెట్ ఫ్లిక్స్ కోసం చేస్తున్న టాక్ షో మెగావర్స్ షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. రోజూ కాదు కానీ ఆర్టిస్టుల డేట్లు దొరికిన వెంటనే పక్కా ప్లానింగ్ తో చకచకా పూర్తి చేస్తున్నారు. డిసెంబర్ రెండో వారం నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ క్రేజీ షో గ్రాండ్ లాంచ్ ఈ నెల నవంబర్ 30న హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. భారీ సంఖ్యలో అభిమానులు రాబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు, పెడుతున్న ఖర్చు, రాబోయే గెస్టులు కళ్లుచెదిరే స్థాయిలో ఉంటాయని తెలిసింది.
తొలి ఎపిసోడ్ లో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ సందడి చేయనుండగా దీని షూట్ రెండు వారాల క్రితమే చేసేశారు. అంతకు ముందు కమెడియన్స్ గ్యాంగ్ బ్రహ్మానందం-సునీల్-సత్య, తర్వాత కమల్ హాసన్ భాగాలు చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. తాజాగా మాస్ మహారాజా రవితేజ, న్యాచురల్ స్టార్ నానితో పాటు దర్శకుడు బాబీ వచ్చిన ఎపిసోడ్ ఫినిష్ చేశారు. నెక్స్ట్ లిస్టులో కోలీవుడ్ హీరో సూర్య కుటుంబం, అటుపై ప్రభాస్ ప్లస్ సందీప్ వంగ, పవన్ కళ్యాణ్ విత్ రామ్ చరణ్ రాబోతున్నట్టు టాక్.
ఏదో సింపుల్ గా లాంచ్ చేశామనే తరహాలో కాకుండా నెట్ ఫ్లిక్స్ చేస్తున్న ప్లానింగ్ ఆషామాషీగా లేదు. అవుట్ డోర్స్ లో పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టించి జనాన్ని ఆకట్టుకునే పనులు మొదలుపెట్టింది. చిరంజీవి పేరులో ఎన్ మాయం చేయడం ద్వారా సోషల్ మీడియా అటెన్షన్ వచ్చేలా చేసుకుంది. ఒక్కో ఎపిసోడ్ తాలూకు ప్రోమోలు ఓ రేంజులో పేలతాయని వినికిడి. చిరు ఎనర్జీ ఊహించని స్థాయిలో ఈ షోకు పెద్ద అసెట్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. మూడు నిర్మాణ సంస్థలు ఇందులో భాగం పంచుకున్నాయి.
జనవరి 13 కాకా విడుదలకు ముందు మెగావర్స్ చేయబోయే హడావిడి ఖచ్చితంగా చిరుకి చాలా ప్లస్ అవుతుంది. పబ్లిక్ లో రీచ్ మరింత పెరగడమే కాకుండా సెలబ్రిటీలతో ఎన్నో విషయాలు రాబట్టుకున్న వైనం ఇతర హీరోల అభిమానులను కూడా ఆకట్టుకుంటుంది. తనదైన కామెడీ టైమింగ్ తో చిరు చాలా చోట్ల చంటబ్బాయిని గుర్తు చేస్తారని ప్రత్యక్షంగా షో చూసిన వాళ్ళు చెబుతున్న మాట. కంటెంట్ కనక వర్కౌట్ అయితే ఆన్ స్టాపబుల్ ని దాటేసే సత్తా మెగావర్స్ కుందని ఫ్యాన్స్ నమ్మకం.
Gulte Telugu Telugu Political and Movie News Updates