ప్రతి ఏడాదీ సంక్రాంతికి భారీ చిత్రాలు మూణ్నాలుగు బరిలోకి దిగుతాయి. వాటి సందడి నెలాఖరు వరకు కొనసాగుతుంది. రిపబ్లిక్ డే వీకెండ్లోనూ ఒకట్రెండు కొత్త సినిమాలు వస్తుంటాయి. ఇక ఆ తర్వాత బాక్సాఫీస్‌లో డల్ సీజన్ మొదలవుతుంది. మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలకు కూడా ఫిబ్రవరి, మార్చి నెలల్లో అనుకున్నంతగా వసూళ్లు ఉండవు. సంక్రాంతికి అదనపు వసూళ్లున్నట్లే ఈ రెండు నెలల్లో వసూళ్లలో కోత ఉంటుంది. ముఖ్యంగా ఫిబ్రవరి మధ్య నుంచి మార్చి మూడో వారం వరకు బాక్సాఫీస్‌కు గడ్డు పరిస్థితులుంటాయి. ప్రతి ఏడాదీ ఈ నాలుగైదు వారాల్లో చిన్నా చితకా సినిమాలే వస్తుంటాయి. పేరున్న సినిమాలు ఈ టైంలో రావడం చాలా అరుదు. కానీ 2021లో మాత్రం దీనికి భిన్నమైన దృశ్యం చూడబోతున్నాం. ఫిబ్రవరి, మార్చి నెలల్లో వరుసబెట్టి పేరున్న సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర విపరీతమైన పోటీ చూడబోతున్నాం ఈసారి.
కరోనా విరామం వల్ల చాలా సినిమాలు పెండింగ్‌లో పడిపోయిన నేపథ్యంలో ఇంకెంతో కాలం వేచి చూసే పరిస్థితులు లేవు. వేసవికి ఎలాగూ భారీ చిత్రాలు బరిలో ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి, మార్చి నెలల్లో చిన్న, మీడియం రేంజ్ సినిమాలు చాలానే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
జాంబీ రెడ్డి, ఉప్పెన, శశి, ఎఫ్‌సీయుకె, చెక్, ఎ1 ఎక్స్‌ప్రెస్, అక్షర, తెల్లవారితే గురువారం, శ్రీకారం, మోసగాళ్లు, గాలి సంపత్, జాతి రత్నాలు.. నెలన్నర వ్యవధిలో చాలా సినిమాలే రిలీజ్ కానున్నాయి. ఈసారి ఫిబ్రవరి, మార్చి నెలలు ముందులా అన్ సీజన్ కావన్న భరోసా నిర్మాతల్లో కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు ఇంకా చాలా వరకు మూతపడే ఉన్నాయి. చదువులు మునుపటిలా సీరియస్‌గా సాగట్లేదు. పరీక్షల విషయంలోనూ అంత సీరియస్‌నెస్ ఉంటుందని అనిపించట్లేదు. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరగడమూ అనుమానంగా ఉంది.
ఈ నేపథ్యంలో ఎప్పట్లా ఫిబ్రవరి, మార్చి నెలల్లో సినిమాలు జాన్తా నై అని విద్యార్థులు, తల్లిదండ్రులు అంత సీరియస్‌గా ఉండరని, ఫ్యామిలీస్ బాగానే థియేటర్లకు వస్తాయని ఇండస్ట్రీ జనాలు ఆశిస్తున్నారు. థియేటర్లలో సినిమాల్లేక అల్లాడిపోయిన జనాలు ఇక వరుసగా థియేటర్లకు వస్తుంటారని.. అన్ సీజన్ భయాలేమీ ఉండవనే భరోసాతోనే ఇలా వరుసగా సినిమాల రిలీజ్ డేట్లు ఇచ్చేస్తున్నారని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు.
This post was last modified on January 28, 2021 4:41 pm
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…