వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో సందీప్‌కిషన్ హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై వేద వ్యాస్ దర్శకత్వంలో మహేశ్ కోనేరు నిర్మాతగా కొత్త సినిమా వైజాగ్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రైటర్ కోన వెంకట్ క్లాప్‌కొట్టగా, కంకట్ల సిల్క్స్ మల్లిక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా…
నిర్మాత మహేశ్ కోనేరు మాట్లాడుతూ “ఈ ఏడాది సంక్రాంతికి మా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్‌లో వచ్చిన ‘మాస్టర్’తో మరో సూపర్ డూపర్ హిట్‌ను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. అదే ఉత్సాహంతో ఈరోజు వైజాగ్‌లో కొత్త సినిమాను స్టార్ట్ చేశాం. డిఫరెంట్ మూవీస్ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చే సందీప్‌కిషన్‌తో మరో డిఫరెంట్ మూవీని మా బ్యానర్‌లో రూపొందించబోతున్నాం. తన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది.
ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. వేద వ్యాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తాం” అన్నారు.
This post was last modified on January 26, 2021 4:37 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…