ఫొటోలు: ఆధ్యాత్మిక గురువుతో సౌత్ హీరోయిన్

తెలుగు, తమిళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మిర్నాళిని రవి పెళ్లి చేసుకుంది. మలేషియాకు చెందిన ఆధ్యాత్మిక గురువు మహావిష్ణుతో ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వీరి వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది.

ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న మిర్నాళిని, మహావిష్ణు నవంబర్ 15న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మలేషియాకు సమీపంలోని లంకావి ఐలాండ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.

పెళ్లికి సంబంధించిన ఫొటోలను మిర్నాళిని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నిశ్చితార్థం తర్వాత పెళ్లి గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ ఫొటోలతో గుడ్ న్యూస్ చెప్పింది.

గద్దలకొండ గణేష్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మామా మశ్చీంద్ర వంటి తెలుగు సినిమాలతో మిర్నాళిని గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు పెళ్లితో తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది ఈ భామ.