టాలీవుడ్ టాప్ స్టార్లు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తమ కొత్త సినిమాలను చడీచప్పుడు లేకుండా మొదలుపెట్టేస్తున్నారు. మహేష్ మొదలుపెట్టాల్సిన కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ అన్న సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు ఏడాది తర్వాత మహేష్ మేకప్ వేసుకుంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ అనుకున్నదానికంటే ఆలస్యంగా ఇప్పుడే మొదలవుతోంది. ఐతే తొలి షాట్ తీస్తోంది ఇండియాలో కాదు.. ఫారిన్లో.
‘సర్కారు వారి పాట’ తొలి షెడ్యూల్ దుబాయ్‌లో ప్లాన్ చేసింది చిత్ర బృందం. అందుకోసం ఇప్పటికే చిత్ర బృందమంతా అక్కడికి చేరుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న కీర్తి సురేష్ దుబాయ్‌కి వెళ్తూ ఫ్లైట్ నుంచి ఫొటోలు కూడా పెట్టిన సంగతి తెలిసిందే. మహేష్ సైతం ఇప్పటికే అక్కడికి చేరుకున్నాడు. ‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్ తీస్తున్న సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఉమ్మడిగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చడీచప్పుడు లేకుండా తన కొత్త సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లిపోయాడు. ఆ చిత్రమే.. అయ్యప్పనుం కోషీయుం రీమేక్. ఇటీవలే ‘వకీల్ సాబ్’ను పూర్తి చేసిన పవన్.. క్రిష్ దర్శకత్వంలో సినిమాను పున:ప్రారంభించాడు. ఆ షూటింగ్‌లో పాల్గొంటూనే.. అయ్యప్పనుం కోషీయుం రీమేక్‌ను కూడా పూర్తి చేయాలని పవన్ నిర్ణయించుకున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
రానా ఇందులో పవన్‌ను ఢీకొట్టే పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సోమవారమే మొదలైంది. రాజకీయ కార్యక్రమాల కోసం కొన్ని రోజులు విరామం తీసుకున్న పవన్.. నేరుగా ఈ సినిమా షూటింగ్‌కు హాజరు కానున్నాడు. తర్వాత మళ్లీ బ్రేక్ తీసుకుని క్రిష్ సినిమా మీదికి వెళ్తాడు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 25, 2021 11:50 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…