Movie News

తన పార్టీ ఏదో చెప్పేసిన జగపతి

తెలుగు సినీ పరిశ్రమలో రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్లు బోలెడంతమంది ఉన్నారు. వారిలో కొందరు నేరుగా రాజకీయాల్లోకి అడుగుపెడితే.. మిగతా వాళ్లు ఎన్నికలప్పుడు తమకు నచ్చిన పార్టీలకు ప్రచారం చేసి పెడుతుంటారు. బయటికి కనిపించకుండా తెర వెనుక పార్టీల కోసం పని చేసే వాళ్లూ ఉన్నారు. ఐతే ఈ సోషల్ మీడియా కాలంలో రాజకీయాలతో సంబంధం పెట్టుకుని ఏదైనా మాట్లాడితే.. అది సినిమాల మీద ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో తమ రాజకీయ ఆసక్తుల గురించి ఓపెన్ కావడానికి కొంచెం జంకుతున్నారు.

ఇలాంటి టైంలో ఇన్ని రోజులు బహిరంగపరచని విషయాన్ని సీనియర్ నటుడు జగపతిబాబు తాను హోస్ట్ చేసే ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోలో బయటపెట్టారు. తనకు తెలుగుదేశం పార్టీ అన్నా, నారా చంద్రబాబు నాయుడన్నా ఎంతో అభిమానమని.. ఆ పార్టీ కోసం తాను పని చేశానని.. ఇప్పుడు అందరితో పాటు చంద్రబాబుకు కూడా ఈ విషయాలు తెలియజేయాలనుకుంటున్నానని జగపతి అన్నారు.

‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోకు చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ అతిథిగా హాజరైన నేపథ్యంలో టీడీపీతో తన అనుబంధం గురించి ఆయన మాట్లాడారు. ‘‘మా అత్తయ్య టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. మా మావయ్య కూడా మాజీ ఎమ్మెల్యేనే. 1999లో నేనోసారి టీడీపీ కోసం ఎన్నికల ప్రచారం కూడా చేశాను. అప్పుడు శుభలగ్నం సినిమాతో నాకు మంచి పేరొచ్చింది. ఆ టైంలోనే 8 వేల మందితో మీటింగ్ పెట్టాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను టీడీపీ సపోర్టర్ అని ఇప్పుడు ఓపెన్‌గా చెప్పాలనుకుంటున్నా.

నిజం చెప్పాలంటే పార్టీ కంటే కూడా దాన్ని నడిపించే వ్యక్తి నాకు ఎక్కువ ఇష్టం. చంద్రబాబు గారి విజన్ అసామాన్యమైంది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇలా ఉంటున్నా అంటే అది ఆయన వల్లే. ఆయన ఏపీని కూడా హైదరాబాద్‌లా మారుస్తారు. డౌటే లేదు. నేను ఒక ఆయుర్వేద సెంటర్ పెట్టాలనుకుని చంద్రబాబు గారిని కలిశాను. దాని పేరేంటి అని అడిగారు. ‘100’ అని చెప్పా. అదేంటి అన్నారు. ‘నిండు నూరేళ్లు’ అని చెప్పా. నూరేళ్లు ఎందుకు అంతకుమించి మనిషి బతకకూడదా అన్నారు. అలా ఉంటుంది ఆయన ఆలోచన’’ అంటూ చంద్రబాబును కొనియాడారు జగపతి.

This post was last modified on November 10, 2026 7:00 am

Share

Recent Posts

ముందే బరువు తగ్గాల్సింది – ఎన్టీఆర్

కెరీర్ ఆరంభంలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండేదో అభిమానులకు గుర్తుండే ఉంటుంది. టాలీవుడ్లో హీరోలు మెయింటైన్ చేసే స్టాండర్డ్స్‌తో…

2 hours ago

‘పార్టీని నాశనం చేస్తున్న అవినాష్ రెడ్డి’

కడప జిల్లాలో ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీని సర్వనాశనం చేస్తున్నారని ఓ  సామాన్య కార్యకర్త జగన్ కు లేఖ రాయడం…

2 hours ago

జ‌గ‌న్ చేయ‌లేన‌న్నారు… బాబు చేసి చూపించారు!

ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌.. పింఛ‌ను విధానం. 2004 సెప్టెంబరులోను.. ఆ త‌ర్వాత‌ ఉద్యోగాల్లో చేరిన వారికి…

2 hours ago

టపాసులు కాలిస్తే రోగాలు పోతాయా?

దీపావళి అంటే దీపాల వెలుగులు, కుటుంబ సభ్యుల సందడి, మిఠాయిలు, బాణసంచా హడావుడి గుర్తుకొస్తాయి. పండుగ వేళ టపాసులు కాల్చడం…

2 hours ago

అనిరుధ్ పెళ్లి… అవతారం మార్చేసిన మాజీ సీఎం

కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్ తనయురాలు కావ్య మారన్…

4 hours ago

అన్నా కొణిదెలతో పవన్ విడాకులు!

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా కొణిదెలతో విడాకులు తీసుకుంటున్నట్లు సంచలన సంయుక్త ప్రకటన…

9 hours ago