Movie News

ముందే బరువు తగ్గాల్సింది – ఎన్టీఆర్

కెరీర్ ఆరంభంలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండేదో అభిమానులకు గుర్తుండే ఉంటుంది. టాలీవుడ్లో హీరోలు మెయింటైన్ చేసే స్టాండర్డ్స్‌తో పోలిస్తే అతను చాలా బరువుగా ఉండేవాడు. తొలి చిత్రం ‘నిన్ను చూడాలని’ నుంచి ‘రాఖీ’ వరకు తారక్ అదే అవతారంలో కొనసాగాడు. ‘రాఖీ’ సినిమాకు తన బరువు హద్దులు దాటిపోయింది. లుక్ మీద చాలా విమర్శలు వచ్చాయి.

ఐతే ‘యమదొంగ’ సినిమాకు ఒక్కసారిగా బాగా బరువు తగ్గిపోయి బక్క చిక్కి కనిపించాడు. తర్వాత కొంచెం బరువు పెరిగి ఐడియల్ వెయిట్‌తో, ఆకర్షణీయంగా తయారయ్యాడు. ఐతే తాను కెరీర్ ఆరంభంలోనే జాగ్రత్త పడి ఉండాల్సిందని తారక్ తాజాగా అభిప్రాయపడ్డాడు. ‘ఇట్లు అర్జున’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న అనీష్‌తో తారక్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా ఒకప్పటి తన లుక్ గురించి తారక్ స్పందించాడు.

అనీష్ డెబ్యూ మూవీ గురించి చర్చిస్తున్న సమయంలో మీ తొలి సినిమాకు మీరు ఎలాంటి అనుభవం ఎదుర్కొన్నారు అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై తారక్ స్పందిస్తూ.. ‘‘అప్పుడు చాలా ఎక్కువ బరువు ఉన్నాను, తర్వాత చూసుకుంటే ఆ లుక్ కరెక్ట్ కాదనిపిస్తుంది. ముందే కొంచెం జాగ్రత్త పడి బరువు తగ్గి ఉంటే బాగుండేది. నీలాగే ఫిట్‌గా తయారై ఉండాల్సింది’’ అని చెప్పాడు. ఐతే తారక్‌ను బొద్దు అవతారంలో చూడడం కూడా చాలా బాగుండేదని, అలా కూడా తనకు చాలా నచ్చాడని అనీష్ వ్యాఖ్యానించగా.. ‘‘అదంతా ప్రేమ.. ప్రేమ.. ప్రేమ వల్ల అలా అనిపిస్తుంది కానీ. అలా ఉండడం కరెక్ట్ కాదు’’ అని తారక్ చెప్పాడు.

అనీష్‌ను ‘నానా.. నానా’ అంటూ ఈ ఇంటర్వ్యూ అంతటా చాలా ప్రేమగా సంబోధించిన తారక్.. అతను తనకెంతో క్లోజ్ అన్నది వివరించాడు. అనీష్ తండ్రి, ఏఎంఆర్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత మహేష్ రెడ్డితో తారక్‌తో పాటు నాగార్జున, చిరంజీవి లాంటి ప్రముఖులకు మంచి అనుబంధం ఉంది. మహేష్ గతంలో ‘షిర్డి సాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు. మహేష్ కంబాల దర్శకత్వంలో రూపొందిన ‘ఇట్లు అర్జున’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

This post was last modified on November 10, 2026 7:00 am

Share

Recent Posts

‘పార్టీని నాశనం చేస్తున్న అవినాష్ రెడ్డి’

కడప జిల్లాలో ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీని సర్వనాశనం చేస్తున్నారని ఓ  సామాన్య కార్యకర్త జగన్ కు లేఖ రాయడం…

39 minutes ago

జ‌గ‌న్ చేయ‌లేన‌న్నారు… బాబు చేసి చూపించారు!

ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌.. పింఛ‌ను విధానం. 2004 సెప్టెంబరులోను.. ఆ త‌ర్వాత‌ ఉద్యోగాల్లో చేరిన వారికి…

39 minutes ago

టపాసులు కాలిస్తే రోగాలు పోతాయా?

దీపావళి అంటే దీపాల వెలుగులు, కుటుంబ సభ్యుల సందడి, మిఠాయిలు, బాణసంచా హడావుడి గుర్తుకొస్తాయి. పండుగ వేళ టపాసులు కాల్చడం…

39 minutes ago

అనిరుధ్ పెళ్లి… అవతారం మార్చేసిన మాజీ సీఎం

కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్ తనయురాలు కావ్య మారన్…

3 hours ago

అన్నా కొణిదెలతో పవన్ విడాకులు!

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా కొణిదెలతో విడాకులు తీసుకుంటున్నట్లు సంచలన సంయుక్త ప్రకటన…

7 hours ago

వియత్నాం ఎయిర్‌పోర్టులో మన పరువు తీశారుగా!

విదేశాలకు వెళ్లడం అంటే కేవలం కొత్త ప్రాంతాలను సందర్శించడం, ఫొటోలు దిగడం, అక్కడి అందాలను ఆస్వాదించడం మాత్రమే కాదు. మన…

10 hours ago