ఒకప్పుడు సోషల్ మీడియా లేకపోవడం తాము అదృష్టవంతులమని సీనియర్ హీరో అక్కినేని నాగార్జున అన్నాడు. ‘ఇట్లు అర్జున’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న అనీష్‌తో కలిసి ఆయన తాజాగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. దీనికి హోస్ట్‌గా వ్యవహరించిన ప్రదీప్ మాచిరాజు.. డెబ్యూ హీరోలు ఎదుర్కొనే ప్రెజర్ గురించి నాగ్‌ను అడిగారు.
మీరు ‘విక్రమ్’ సినిమాకు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నారు అని ప్రశ్నిస్తే.. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేకపోవడం తమ అదృష్టమని నాగ్ అన్నారు.
డెబ్యూ సినిమాకు కచ్చితంగా ఒత్తిడి ఉంటుందని.. కానీ ఇప్పటికీ ప్రతి సినిమాకూ టెన్షన్ పడతానని నాగ్ అన్నాడు. ఈ రోజుల్లో సోషల్ మీడియా వల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తోందని చెప్పాడు.
సామాజిక మాధ్యమాలు చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటున్నాయని.. చిన్న తప్పు జరిగినా చాలా తీవ్రంగా స్పందిస్తారని నాగ్ అన్నాడు. సోషల్ మీడియా నుంచి ఎస్కేప్ కావడం అన్నది సాధ్యం కాని పని అని.. కాబట్టి వాళ్లకు దొరక్కుండా పర్ఫెక్ట్‌గా సినిమాలు తీయాలని నాగ్ అభిప్రాయపడ్డాడు.
ఇక ‘ఇట్లు అర్జున’ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడం గురించి నాగ్ స్పందిస్తూ.. అనీష్ తండ్రి మహేష్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అని, తనను కలిసేందుకు వెళ్లినపుడు ఒక సందర్భంగా సినిమాల్లోకి రావాలనుకుంటున్నట్లు చెప్పాడని.. తర్వాత ‘ఇట్లు అర్జున’ లైన్ చెప్పాడని.. అంతకుమించి పెద్ద చర్చేమీ జరగలేదని అన్నాడు.
ఎప్పుడైనా కలిస్తే సినిమా సంగతేంటి, ఎలా చేస్తున్నారని పైపైన అడిగేవాడినని.. ఐతే తర్వాత టీజర్ చూపించారని.. అది నచ్చడంతో సినిమా చూపించమని అడిగానని, కానీ ఇంకో నెల టైం పడుతుందని చెప్పారని నాగ్ వెల్లడించారు. సినిమా రెడీ అయ్యాక తీసుకెళ్లి తనకు చూపించారని, అది చాలా నచ్చడం, అనీష్ పెర్ఫామెన్స్ తనను ఆశ్చర్యపరచడంతో ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు నాగ్.
This post was last modified on November 10, 2026 7:01 am
తెలుగు సినీ పరిశ్రమలో రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్లు బోలెడంతమంది ఉన్నారు. వారిలో కొందరు నేరుగా రాజకీయాల్లోకి అడుగుపెడితే.. మిగతా…
కెరీర్ ఆరంభంలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండేదో అభిమానులకు గుర్తుండే ఉంటుంది. టాలీవుడ్లో హీరోలు మెయింటైన్ చేసే స్టాండర్డ్స్‌తో…
కడప జిల్లాలో ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీని సర్వనాశనం చేస్తున్నారని ఓ సామాన్య కార్యకర్త జగన్ కు లేఖ రాయడం…
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. పింఛను విధానం. 2004 సెప్టెంబరులోను.. ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి…
దీపావళి అంటే దీపాల వెలుగులు, కుటుంబ సభ్యుల సందడి, మిఠాయిలు, బాణసంచా హడావుడి గుర్తుకొస్తాయి. పండుగ వేళ టపాసులు కాల్చడం…
కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్ తనయురాలు కావ్య మారన్…