Movie News

దేవతలా మెరిసిపోయిన సమంత..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. తన అందం.. నటనతోనే కాకుండా ఫ్యాషన్ విషయంలోనూ ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఎలాంటి డ్రెస్ వేసిన.. ఆ డ్రెస్సుకి అందం తీసుకొస్తుంది సమంత స్టైల్. ఈ క్రమంలో తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఒక్కో ఫోటోలో ఒక్కో రంగులో మెరిసిపోతూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.

పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, నారింజ, నీలం వంటి ఎన్నో రంగుల్లో సమంత కనిపించింది. చీరలు, సంప్రదాయ దుస్తులు, ఆధునిక శైలిలో రూపొందించిన ఎథ్నిక్ వేర్‌లో ఆమె ఎంతో అందంగా కనిపించింది. ఈ ఫోటోలను చూస్తుంటే ఈ దీపావళికి.. అమ్మాయిలు ఎలాంటి రంగులు వేస్తే అందంగా ఉంటారు అనేది అర్థమైపోతుంది. అలాంటి అద్భుతమైన రంగులు ఉన్న డ్రెస్సులు వేసుకొని ఆకట్టుకుంది సమంత.

సమంత తన పోస్ట్‌కు “గత కొన్ని నెలల్లో నేను ఎంతో ఇష్టంగా ధరించిన కొన్ని లుక్స్” అనే క్యాప్షన్ పెట్టింది. మొత్తం పైన ఈ ముద్దుగుమ్మ..తనకు నచ్చిన దుస్తులను అభిమానులతో పంచుకుంటూ ఫ్యాషన్ ప్రేమికులకు మంచి ఐడియాలు ఇచ్చింది.

ఒక ఫోటోలో నారింజ రంగు దుస్తుల్లో కనిపించిన సమంత ఎంతో హుందాగా ఉంది. కేప్ తరహా చేతులు, అందమైన డిజైన్‌తో .. ఆ డ్రెస్ చాలా అందంగా ఉంది. మరో లుక్‌లో ఎరుపు రంగు చీరలో రాజసం ఉట్టిపడేలా కనిపించింది. మెడలో బంగారు ఆభరణం, అందమైన హెయిర్ స్టైల్ ఆమె రూపానికి మరింత ఆకర్షణ తీసుకువచ్చి పెట్టింది.

ఇక లేత ఆకుపచ్చ రంగు చీరలో సమంత అందం మరో స్థాయిలో కనిపించింది. సింపుల్‌గా ఉండే తెల్లటి బ్లౌజ్‌తో ఆ చీరను జతచేసి చాలా క్లాసీగా కనిపించింది. తక్కువ ఆభరణాలతోనే తన అందాన్ని మరింత ప్రత్యేకంగా చూపించింది.

మరో ఫోటోలో ఆకుపచ్చ రంగు ప్రింటెడ్ కుర్తాలో కనిపించింది. అలాగే మిర్రర్ వర్క్‌తో రూపొందించిన నీలి రంగు అనార్కలీ దుస్తుల్లో కూడా సమంత ఎంతో అందంగా మెరిసిపోయింది. 

ఈ ఫోటోలను చూసిన సమంత ఫ్రెండ్ చిన్మయి శ్రీపాద ఆమెను “గాడెస్” అంటూ కామెంట్ కూడా పెట్టింది. అభిమానులు కూడా ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ దశ ఎంజాయ్ చేస్తు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత.. ఫ్యాషన్ విషయంలో మాత్రం అస్సలు గ్యాప్ ఇచ్చేలా లేదు.

This post was last modified on November 8, 2026 2:04 am

Page: 1 2 3 4

Share

Recent Posts

పట్టుదలగా ఉండటం మంచిదే కానీ

కాకా గురించి నెలకు కనీసం రెండు మూడుసార్లు పుకార్లు రావడం, వాటిని ఖండిస్తూ ఏదో ఒక రూపంలో జనవరి 13…

50 minutes ago

అనస్వర టైం మొదలవబోతోందా?

మలయాళంలో చాలా చిన్న వయసులో నటిగా గొప్ప పేరు సంపాదించింది అనస్వర రాజన్. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ‘దృశ్యం’…

1 hour ago

బొత్స కూతురు ఓడిపోయినా కోడలు గెలిచింది

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మండలిలో వైసీపీ సభాపక్ష నేత బొత్స సత్యన్నారాయణ తన రాజకీయ వారుసురాలిగా కూతురు…

3 hours ago

ఇందిరమ్మ ఎమర్జెన్సీ తప్పును ఒప్పుకున్న సోనియా గాంధీ

దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించిన విష‌యం తెలిసిందే. 1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వరకు సరిగ్గా 21…

3 hours ago

మెగా ఫోన్ పట్టబోతున్న సూపర్ స్టార్

నటులు దర్శకులుగా మారడం ఎప్పట్నుంచో చూస్తున్నాం. కానీ సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నవాళ్లు మాత్రం దర్శకత్వం జోలికి వెళ్లడం అరుదు.…

5 hours ago

బొత్స గారు.. వార‌సురాలినీ గెలిపించుకోలేక పోయారే..!

వైసీపీ సీనియ‌ర్ నేత‌, శాస‌న మండ‌లిలో విపక్ష నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ వార‌సురాలిగా రాజ‌కీయ అరం గేట్రం చేసిన బొత్స…

5 hours ago