మొదటి సినిమా ‘చి.ల.సౌ’తోనే తెలుగు ప్రేక్షకుల అటెన్షన్ సంపాదించింది రూహానీ శర్మ. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, హీరో సుశాంత్ కంటే రుహానీకే బాగా పేరు తెచ్చిపెట్టింది. ఈ ఏడాది విశ్వక్‌సేన్ ‘హిట్: ఫస్ట్ కేస్’లో హీరోయిన్‌గా నటించిన రుహానీ… లాక్‌డౌన్ టైమ్‌ను పర్ఫెక్ట్‌గా వాడుకుంటోందట. టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ కావాలనుకుంటున్న రుహానీ… డైలీ ఆన్‌లైన్‌లో తెలుగు నేర్చుకుంటోంది.
ప్రస్తుతం ఎమ్.ఎస్. రాజు దర్శకత్వంలో ‘డర్టీ హరి’ అనే సినిమాలో నటిస్తున్న రుహానీ… శ్రీనివాస్ అవసరాల హీరోగా రూపొందుతున్న ‘నూటొక్క జిల్లాల అందగాడు’ మూవీలోనూ నటిస్తోంది. ‘నాకు తెలుగంటే చాలా ఇష్టం.
ఎప్పటినుంచో తెలుగు భాష నేర్చుకోవాలని అనుకుంటున్నా. అయితే రెగ్యూలర్ షూటింగ్స్‌తో బిజీగా ఉండడం వల్ల ఇప్పటిదాకా వీలు కాలేదు. లాక్‌డౌన్ టైమ్‌లో రోజూ గంటసేపు ఆన్‌లైన్ క్లాసులు వింటూ తెలుగు పలకడం నేర్చుకుంటున్నా… డైలాగ్స్ ఎలా పలకాలో స్పష్టంగా తెలుసుకుంటున్నా…’ అంటూ చెప్పుకొచ్చింది.
అవసరాల శ్రీనివాస్ ‘నూటొక్కజిల్లాల అందగాడు’ మూవీలో రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేసే ఇండిపెండెంట్ అండ్ మోడ్రన్ అమ్మాయిగా కనిపిస్తున్న రుహానీ… ‘ఆగ్రా’ అనే మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. మొదటి సినిమాలో పద్ధతైన మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపించిన రుహానీ… హాట్ అండ్ గ్లామరస్ లుక్స్‌లో కనిపించడానికి కూడా సై అంటోంది.
This post was last modified on May 6, 2020 1:11 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…