రామాయణ పార్ట్ 1 సక్సెస్ తో రన్బీర్ కపూర్ మంచి హుషారు మీదున్నాడు. పేరు తెచ్చుకునే విషయంలో యష్ పోటీ పడి డామినేషన్ చూపిస్తున్నప్పటికీ హీరోగా తన వంతు గుర్తింపు తనకు దక్కడం, నెగటివిటీ రాకపోవడం పట్ల రన్బీర్ సంతోషంలో సహేతుకత ఉంది. అయితే వసూళ్ల పరంగా ఎంత దూరం వెళ్తుంది, దురంధర్ ని దాటగలదా లేదానే దాని మీదే బ్లాక్ బస్టర్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. అయితే రన్బీర్ ఒక్క విషయంలో కొంచెమే అతిశయోక్తిగా మాట్లాడినట్టు కనిపిస్తోంది.
ఒక పాడ్ క్యాస్ట్ లో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లలో మనకు తలుపులు తెరుచుకున్నాయని, ఇప్పుడు రామాయణ వల్ల వారణాసికి మేం తలుపులు తీసినట్టు అయ్యిందని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు. వాస్తవంగా చెప్పాలంటే ఇంతకన్నా పెద్ద జోక్ ఉండదు. ఎందుకంటే వారణాసికి ఎలాంటి బ్యాకప్, సపోర్ట్ అక్కర్లేదు. ఇప్పటికే విపరీతమైన అంచనాలతో బిజినెస్ పరంగా ప్రకంపనలు సృష్టించే స్థాయిలో బిజినెస్ ఎంక్వయిరీలు చూపిస్తోంది. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు.
రాజమౌళికి ఎవరూ తలుపులు తీయనవసరం లేదు. ఇండియన్ సినిమా మార్కెట్ వెయ్యి కోట్లు సులభంగా దాటగలదని బాహుబలితో రుజువు చేసిన మాస్టర్ ఫిలిం మేకర్ ఆయన. ఆర్ఆర్ఆర్ రూపంలో ఆస్కార్ అవార్డుని తెచ్చిన ఘనత జక్కన్న సొంతం. జేమ్స్ క్యామరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ లాంటి వాళ్ళ మెచ్చుకోలు అందుకున్న లెజెండ్. ఇంత ట్రాక్ రికార్డు ఉంది కాబట్టే వారణాసి విషయంలో పెద్దగా కంటెంట్ రివీల్ చేయకుండానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి.
అలాంటప్పుడు రామాయణ చూపించే దారి వారణాసికి అసలు అక్కర్లేదు. రన్బీరే నటించిన బ్రహ్మాస్త్రకు ఒక రేంజ్ హంగామా చేయడం అందరికీ గుర్తే. విజయం సాధించింది కానీ చరిత్రలో చెప్పుకునే రికార్డులు ఎక్కడ దక్కాయి. దీనికే కాదు బాహుబలిని స్ఫూర్తి గా తీసుకుని తీసిన ఎన్నో సినిమాలు దాని పొలిమేరని కూడా టచ్ చేయలేకపోయాయి. అసలు రామాయణ ఇప్పుడు రిలీజ్ కాకపోయినా వారణాసి హైప్ విషయంలో ఒక్క శాతం తగ్గుదల కూడా ఉండేది కాదు. రాజమౌళి సృష్టించిన బ్రాండ్ స్థాయి అది.
This post was last modified on November 7, 2026 10:44 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడ పరిధిలోని ఎంపీటీసీ, జడ్పీటీసీలలో కూటమి విజయ దుందుభి మోగించింది. ఈ ప్రాంతాల్లోని అన్ని స్థానాల్లోనూ 96.87%…
కాకా గురించి నెలకు కనీసం రెండు మూడుసార్లు పుకార్లు రావడం, వాటిని ఖండిస్తూ ఏదో ఒక రూపంలో జనవరి 13…
మలయాళంలో చాలా చిన్న వయసులో నటిగా గొప్ప పేరు సంపాదించింది అనస్వర రాజన్. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ‘దృశ్యం’…
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మండలిలో వైసీపీ సభాపక్ష నేత బొత్స సత్యన్నారాయణ తన రాజకీయ వారుసురాలిగా కూతురు…
దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. 1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వరకు సరిగ్గా 21…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. తన అందం.. నటనతోనే కాకుండా ఫ్యాషన్ విషయంలోనూ ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఎలాంటి…