Movie News

అనస్వర టైం మొదలవబోతోందా?

మలయాళంలో చాలా చిన్న వయసులో నటిగా గొప్ప పేరు సంపాదించింది అనస్వర రాజన్. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ‘దృశ్యం’ దర్శకుడు జీతు జోసెఫ్ తీసిన ‘నేరు’ సినిమా చూస్తే ఆమె ఎంత గొప్ప పెర్ఫామరో అర్థమవుతుంది. ఇంకా మరెన్నో చిత్రాల్లో తన టాలెంట్ చూపించింది అనస్వర. ఈ అమ్మాయి గత ఏడాదే తెలుగులోకి కూడా అడుగుపెట్టింది.
శ్రీకాంత్ కొడుకు రోహన్ హీరోగా రూపొందిన ‘ఛాంపియన్’లో నటనకు అవకాశమున్న మంచి పాత్రే చేసింది అనస్వర.

ఐతే ఆ సినిమా ఆమెకు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. కంటెంట్ ఉన్న సినిమానే అయినా.. ప్రేక్షకులను పూర్తిగా స్థాయిలో మెప్పించలేకపోయింది ‘ఛాంపియన్’. డెబ్యూ మూవీ ఆడకపోయినా అనస్వరకు తెలుగులో అవకాశాలకైతే లోటు లేదు. టాలీవుడ్లో ఇంకొన్ని రోజుల్లో ఆమె టైం మొదలయ్యేలా కనిపిస్తోంది.

కొన్ని నెలల వ్యవధిలో మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది అనస్వర. ముందుగా వచ్చే శుక్రవారం ‘ఇట్లు అర్జున’తో రాబోతోందామె. అనీష్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల నిర్మించాడు. దీని టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. మంచి ఎంటర్టైనర్‌‌ను చూడబోతున్న సంకేతాలిచ్చాయి. అనస్వరకు కూడా ప్రాధాన్యమున్న పాత్రే దక్కినట్లుంది. ‘ఛాంపియన్’లో మాదిరి కాకుండా ఈసారి గ్లామర్ టచ్ కూడా ఉన్నట్లుంది.

దీని తర్వాత సంక్రాంతికి ‘కాకా’ లాంటి క్రేజీ ప్రాజెక్టుతో పలకరించబోతోంది అనస్వర. అందులో ఆమె చిరంజీవి కూతురి పాత్ర చేస్తుండడం విశేషం. కథలో తన పాత్ర ఎంతో కీలకమట. అది హిట్టయితే తన కెరీర్ గొప్ప మలుపు తిరుగుతుందనడంలో సందేహం లేదు. మరోవైపు వరుస హిట్లతో దూసుకెళ్తున్న యంగ్ హీరో సంగీత్ శోభన్‌తో ఆమె ‘అంతా రాములోరు చూసుకుంటారు’ సినిమా చేస్తోంది. దాని టీజర్ కూడా ప్రామిసింగ్‌గా కనిపించింది. అనస్వర చేతిలో ఇంకా రెండు మూడు చిత్రాలు ఉన్నట్లు సమాచారం. ‘ఇట్లు అర్జున’ హిట్టయిందంటే తనకు డిమాండ్ మరింత పెరగడం ఖాయం.

This post was last modified on November 7, 2026 8:32 pm

Share

Recent Posts

పట్టుదలగా ఉండటం మంచిదే కానీ

కాకా గురించి నెలకు కనీసం రెండు మూడుసార్లు పుకార్లు రావడం, వాటిని ఖండిస్తూ ఏదో ఒక రూపంలో జనవరి 13…

16 minutes ago

బొత్స కూతురు ఓడిపోయినా కోడలు గెలిచింది

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మండలిలో వైసీపీ సభాపక్ష నేత బొత్స సత్యన్నారాయణ తన రాజకీయ వారుసురాలిగా కూతురు…

2 hours ago

ఇందిరమ్మ ఎమర్జెన్సీ తప్పును ఒప్పుకున్న సోనియా గాంధీ

దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించిన విష‌యం తెలిసిందే. 1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వరకు సరిగ్గా 21…

3 hours ago

మెగా ఫోన్ పట్టబోతున్న సూపర్ స్టార్

నటులు దర్శకులుగా మారడం ఎప్పట్నుంచో చూస్తున్నాం. కానీ సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నవాళ్లు మాత్రం దర్శకత్వం జోలికి వెళ్లడం అరుదు.…

4 hours ago

బొత్స గారు.. వార‌సురాలినీ గెలిపించుకోలేక పోయారే..!

వైసీపీ సీనియ‌ర్ నేత‌, శాస‌న మండ‌లిలో విపక్ష నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ వార‌సురాలిగా రాజ‌కీయ అరం గేట్రం చేసిన బొత్స…

5 hours ago

గడ్డం పెంచినంత మాత్రాన కేటీఆర్ రేవంత్ రెడ్డి కాలేడు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్య కొత్త లుక్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి క్లీన్ షేవ్…

5 hours ago