Movie News

సూర్యకు మామూలు జాక్‌పాట్ కాదు

ఈ ఏడాది మే 15న తమిళ స్టార్ హీరో సూర్య ఎలాంటి స్థితిలో ఉన్నాడో గుర్తుండే ఉంటుంది. చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న అతను.. ‘కరుప్పు’ సినిమా మీద ఎన్నో ఆశలతో ఉంటే, ఆ చిత్రం ఆ రోజు విడుదలకు నోచుకోలేదు. నిర్మాతకు సంబంధించి ఫైనాన్షియల్ గొడవలు సినిమాకు అడ్డంకిగా మారి, విడుదల ఆగిపోతే.. సూర్య చాలా పెద్ద మొత్తానికి స్యూరిటీ ఇచ్చి తర్వాతి రోజు సినిమాను రిలీజ్ చేయించాడు.

ఆ సినిమా ఫెయిలై ఉంటే సూర్య ఎంత ఇబ్బంది పడేవాడో. అప్పటికే ‘కంగువ’ సినిమా విషయంలో ఇలాగే చాలా భారం మోశాడు. ‘కరుప్పు’ ఆడకపోయి ఉంటే ఆర్థికంగా పెద్ద నష్టమే చవిచూడాల్సి వచ్చేది. కానీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. నిర్మాత కష్టాలను తీర్చేసింది. సూర్యకు ఇబ్బంది రాకుండా చూసింది. చాలా ఏళ్ల తర్వాత భారీ విజయాన్నందుకున్న సూర్య.. ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

ఇంకో మూడు నెలల తర్వాత ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ఇంకో పెద్ద హిట్ కొట్టాడు. ఇంకో మూడు నెలల లోపే ఇప్పుడు ‘సీన్’తో బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తున్నాడు. నిన్న రిలీజైన ఈ చిత్రానికి తెలుగులో కొంచెం మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ.. తమిళంలో మాత్రం ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. రెండో రోజు ఊపు చూస్తుంటే.. సూర్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ జమ అయ్యేలా కనిపిస్తోంది. కేరళలో కూడా ఈ సినిమా దుమ్ము దులుపుతోంది. సూర్యకు కేరళలో మంచి ఫాలోయింగ్ ఉండగా.. ఈ చిత్రాన్ని రూపొందించింది మలయాళ దర్శకుడు జీతు మాధవన్, హీరోయిన్‌గా నటించిన నజ్రియా నజీమ్.

కాబట్టి అక్కడ కూడా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉంది. ఇది ఎక్కువ హీరోయిజం లేని ఆఫ్ బీట్ సినిమా కావడంతో వేరే నిర్మాతలు భయపడతారేమో అని తన సొంత బేనర్లో ప్రొడ్యూస్ చేశాడు సూర్య. ఐతే పరిమిత బడ్జెట్లో సినిమా పూర్తయిపోగా.. ఆ మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ నుంచే వెనక్కి వచ్చేసిందట. థియేటర్ల నుంచి వచ్చేదంతా లాభాలేనట. ఈ సినిమా ఈజీగా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. కాబట్టి సూర్య పెద్ద జాక్ పాట్ కొట్టినట్లే అన్నమాట.

This post was last modified on November 7, 2026 8:09 pm

Share

Recent Posts

జ‌గ‌న్‌కు డబుల్ షాక్‌..

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం.. పులివెందుల పూర్తిగా టీడీపీ వ‌శం అయిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో పులివెందుల…

7 minutes ago

గోల్డ్ డైమండ్స్ తేడా ప్రేక్షకులకు తెలుసు

ఇటీవలే విడుదలైన 'సమ్మర్ హాలిడేస్' టాక్ అయితే డీసెంట్ గానే ఉంది. బాలేదని ఎవరూ అనలేదు. అలాని ఎక్స్ ట్రాడినరి…

1 hour ago

నీళ్లు ఇచ్చినందుకు కార్యకర్తని కొట్టబోయిన రోజా

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇక్కడ కూడా రిపీట్ అయ్యాయి.…

2 hours ago

10 సినిమాల తాకిడిని బాక్సాఫీస్ తట్టుకోగలదా

ఎన్నిసార్లు ఎన్ని పాఠాలు నేర్చుకున్నా అతివృష్టి అనావృష్టి పద్దతిని టాలీవుడ్ ఇప్పట్లో విడిచిపెట్టేలా లేదు. మంచి డేట్లు వదిలేసుకోవడం, ప్యాన్…

3 hours ago

సురేఖ వాణి వీడియో నిజమే కానీ…

సీనియర్ నటి సురేఖ వాణి పేరు నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆమె ప్రైవేట్ వీడియో ఒకటి…

4 hours ago

ఆరు నెలల్లో ఏడు సార్లు హత్యాయత్నం

పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు ఏమీ మారలేనట్టే కనిపిస్తుంది. మమతా బెనర్జీ పాలనలో మితిమీరిపోయిన రౌడీయిజంతో విసుగెత్తిన ప్రజలు బీజేపీకి ఓట్లేసి…

4 hours ago