ఇప్పటికీ 20 ఏళ్ల అమ్మాయిలా మెరుస్తున్న త్రిష

చిన్న చిన్న క్యారెక్టర్లతో తమిళంలో తన కెరీర్‌ను మొదలుపెట్టిన త్రిష.. ఆ తర్వాత ఎంతో స్టార్ స్టేటస్‌ను అందుకుంది. ముఖ్యంగా నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ఇక్కడి ప్రేక్షకులను కూడా తన అందం, అభినయంతో విపరీతంగా ఆకట్టుకుంది.

త్రిష ఎంత గొప్పగా నటిస్తుందో అన్న విషయం పౌర్ణమి సినిమా చూస్తే అర్థమవుతుంది. పౌర్ణమి సినిమా పెద్దగా హిట్ కాకపోయినా.. అందులో త్రిష నటనకు ఫిదా అయిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు.

ప్రస్తుతం త్రిష వయసు 43 సంవత్సరాలు అయినప్పటికీ.. ఇప్పటికీ 20 ఏళ్ల అమ్మాయిలాగే కనిపిస్తూ ఉంటుంది. త్రిషతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్లందరూ.. ప్రస్తుతం అమ్మ, అక్క పాత్రలు చేసుకుంటూ ఉంటే.. త్రిష మాత్రం ఇప్పటికీ హీరోయిన్‌గా అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది.

ఈ క్రమంలో త్రిష బయట ఎక్కడైనా కనిపించినా.. ఆమె అభిమానులు ఆమె అందానికి జేజేలు పలుకుతూనే ఉంటారు. తాజాగా త్రిష చెన్నైలో.. జరిగిన వైఎస్ అనిల్ రెడ్డి కూతురి పెళ్లికి విజయ్‌తో కలిసి వచ్చి మరోసారి అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ ఫంక్షన్‌లో ఆమె కట్టుకున్న పింక్ చీర అమ్మాయిల కళ్లను ఆకర్షిస్తుంటే.. అబ్బాయిల మనసులను దోచేస్తోంది.

స్టైలింగ్ అంటే త్రిష దగ్గర నుంచే నేర్చుకోవాలి ఏమో అని ఒకపక్క అమ్మాయిలు కామెంట్లు పెడుతుంటే.. మరోపక్క అందం అంటే త్రిషదే ఏమో అంటూ అబ్బాయిలు కామెంట్లు చేస్తున్నారు.