Movie News

నటి ఫోన్ కాల్.. డాక్టర్‌కు ఊహించని షాక్!

మలయాళీ సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు నటులు క్రిమినల్ కేసులో అరెస్టు కావడం కేరళలో సంచలనం సృష్టించింది. వైద్య సహాయం అవసరమంటూ ఒక డాక్టర్‌ను అపార్ట్‌మెంట్‌కు పిలిపించి, అక్కడ పలువురితో కలిసి దాడి చేసి విలువైన వస్తువులను దోచుకున్నారనే ఆరోపణలు వారిపై నమోదయ్యాయి. ఈ కేసులో మలయాళ నటి అతుల్య చంద్ర, నటుడు బిబిన్ పెరుంబల్లి సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో తొమ్మిది మంది కోసం గాలింపు చేపట్టారు.

నవంబర్ 2న కొచ్చిలోని వైట్టిలా ప్రాంతంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. 41 ఏళ్ల డాక్టర్ కి నటి అతుల్య చంద్రతో గతంలో పరిచయం ఉంది. తన బంధువుల్లో ఒకరికి ఆరోగ్యం బాగోలేదని, అత్యవసరంగా వైద్య సహాయం అందించాలని ఆమె డాక్టర్ కి కాల్ చేసి రిక్వెస్ట్ చేసింది. పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి ఫోన్ చేసిన వెంటనే స్పందించిన డాక్టర్ ఆమె ఇచ్చిన అడ్రస్ వివరాల ప్రకారం అపార్ట్మెంట్ కు వెళ్లారు.

అయితే అక్కడికి చేరుకున్న తర్వాత పరిస్థితి ఊహించని విధంగా మారింది. అపార్ట్‌మెంట్‌లో దాదాపు 12 మంది ఉండటంతో డాక్టర్ ఆశ్చర్యపోయారు. తమ బంధువుకు మత్తు పదార్థాలు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ అక్కడున్నవారు ఆయనపై ఆరోపణలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆయనను ఒక గదిలో నిర్బంధించి దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో నటుడు బిబిన్ పెరుంబల్లి కూడా పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

దాడి సమయంలో డాక్టర్ వద్ద ఉన్న రెండు మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను నిందితులు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ.3.25 లక్షలుగా అంచనా వేశారు. ఈ ఘటన గురించి బయటకు చెప్పకూడదని బెదిరించినట్టు డాక్టర్ పోలీసులకు వెల్లడించారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నటి అతుల్య చంద్ర, నటుడు బిబిన్ పెరుంబల్లి, మరో వ్యక్తి కేబీ విష్ణును అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 12 మందిపై ఆరోపణలు ఉండగా, మిగిలినవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అక్రమ నిర్బంధం, దాడి, బెదిరింపులు, దోపిడీకి సంబంధించిన అభియోగాలపై విచారణ కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే.. నటి బంధువుగా చెప్పబడుతున్న మహిళ డాక్టర్‌పై లైంగిక దాడి ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వైద్యుడిపై కూడా పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఒకవైపు డాక్టర్ తనపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారని ఫిర్యాదు చేయగా, మరోవైపు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది.

పరస్పర ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో డాక్టర్‌ను పిలిపించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? దాడి, దోపిడీ ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? వైద్యుడిపై వచ్చిన ఫిర్యాదులో నిజానిజాలేమిటి? అనే అంశాలు విచారణలో తేలాల్సి ఉంది.

This post was last modified on November 6, 2026 6:48 pm

Share

Recent Posts

45 నిమిషాల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే..

నగరాల్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. ముఖ్యంగా పర్యాటకులు, భక్తులు అధికంగా వచ్చే ప్రాంతాల్లో రహదారులపై ప్రయాణం చేయడం పెద్ద…

1 hour ago

చంద్ర‌బాబు క‌ల నెర‌వేరిందా… ?

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల నెర‌వేరిందా? ఆయ‌న ఆశిస్తున్న‌ట్టుగా మ‌రిన్ని పెట్టుబ‌డులు రాష్ట్రానికి చేర‌నున్నా యా? అంటే.. అవున‌నే స‌మాధాన‌మే…

2 hours ago

సంక్షేమ పథకాలకు ఓటర్ కార్డు ఎందుకు?

సర్ వెనక ఏదో కుట్ర జరుగుతుందని ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. తొలుత రోహింగ్యాల ఓట్లను…

2 hours ago

సామాజిక న్యాయ సుడిగుండంలో ‘వైసీపీ’ ..!

2019 ఎన్నికల్లో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గం, 2024 ఎన్నికల నాటికి, ఆ తర్వాత కాలంలో తీవ్ర‌…

4 hours ago

కూట‌మి వాల్యూ తెలిసిందా త‌మ్ముళ్లూ.. !

ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి అత్యంత కీలకమైన రాజకీయ సమీకరణంగా మారింది. ఈ మూడు పార్టీలు కలిసి…

5 hours ago

ఆదర్శ కుటుంబం.. సగానికి సగం

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి క్లాసిక్స్ అందించిన జోడీ విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లది. ఐతే ఆ చిత్రాలకు…

5 hours ago