ఏపీ సీఎం చంద్రబాబు కల నెరవేరిందా? ఆయన ఆశిస్తున్నట్టుగా మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి చేరనున్నా యా? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం రహదారి కనెక్టివిటీ బాగానే ఉంది. రాజధాని నుంచి ఇతర ప్రాంతాలను కలిపేలా సీడ్ యాక్సిస్ రోడ్డును కూడా బాగానే డెవలప్ చేశారు. ఫలితంగా పెట్టుబడులకు మార్గం సుగమం అవుతోంది. రాజధాని ప్రాంతానికి రాకపోకలు పెరిగితే.. మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నది చంద్రబాబు ఆలోచన. ఈ క్రమంలోనే మరిన్ని పెట్టుబడులు రాబట్టేందుకు విమాన సర్వీసులు కూడా చేపట్టాలని నిర్ణయించారు.
ఈ క్రమంలోనే తన సొంత నియోజకవర్గం కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల ఏర్పాటుకు కూడా సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. ఇక, మంత్రి రామ్మోహన్.. మన రాష్ట్రానికి చెందిన నాయకుడు కావడం.. అందునా అధికార పార్టీ ఎంపీ కావడంతో ఈ ప్రయత్నాలు కూడా ఫలించాయి. దీంతో తాజాగా కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు పౌర విమానయాన శాఖ సైట్ క్లియరెన్స్ ఇచ్చింది. రెండు విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతించింది.
వీటితో పాటు.. నాగార్జున సాగర్, తుని-అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలు, అనంతపురం, అమరావతి, దగదర్తిలో విమానాశ్రయాలు అభివృద్ధికి కూడా చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఈ విమానాశ్రయాలు కూడా పూర్తయితే.. రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడి దారులు, వ్యాపార వేత్తల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంచనా వేస్తున్నారు. తద్వారా.. రాష్ట్రంలో పెట్టుబడులకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇప్పుడు దాదాపు అదే జరిగింది.
నిర్మాణానికి సమయం..
ఆయా విమానాశ్రయాలకు ఇప్పుడు అనుమతులు లభించినా.. నిర్మాణానికి మాత్రంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ.. రాష్ట్రానికి మణి హారంగా భావిస్తున్న ఈ విమానాశ్రయాల ద్వారా అభివృద్ధి మరింత పెరు గుతుందని అంటున్నారు. కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటు చేయడం ద్వారా.. కర్ణాటక నుంచి పెట్టుబడులు తిరుపతికి వచ్చే అవకాశం.. తద్వారా శ్రీసిటీకి మరింత వైభవం దక్కనుంది. అలానే సాగర్ విమానాశ్రయం అభివృద్ధితో తెలంగాణ నుంచి కూడా పెట్టుబడులు ఏపీకి రానున్నాయి. ఇక, శ్రీకాకుళంలో విమానాశ్రయం ఉండడంతో భోగాపురం నుంచి శ్రీకాకుళం వరకు మరింత ఆర్థిక కారిడార్ డెవలప్ అవుతుందని భావిస్తున్నారు. మొత్తంగా పెట్టుబడులకు ఈ విమానాశ్రయాలు చోదక శక్తిగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on November 6, 2026 3:08 pm
సర్ వెనక ఏదో కుట్ర జరుగుతుందని ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. తొలుత రోహింగ్యాల ఓట్లను…
2019 ఎన్నికల్లో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గం, 2024 ఎన్నికల నాటికి, ఆ తర్వాత కాలంలో తీవ్ర…
ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి అత్యంత కీలకమైన రాజకీయ సమీకరణంగా మారింది. ఈ మూడు పార్టీలు కలిసి…
నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి క్లాసిక్స్ అందించిన జోడీ విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లది. ఐతే ఆ చిత్రాలకు…
పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా అదొక సంచలనమే. ముఖ్యంగా తన ఇంటర్వ్యూల్లో ఏదో ఒక సందర్భంలో…
వైసీపీ అధినేత జగన్ బాబాయి కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం వేడుక చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో…