Trends

గ్యాస్ సిలిండర్‌కు మంటలు వస్తే ఇలాగా చేసేది?

గ్యాస్ సిలిండర్ డెలివరీ అంటే కేవలం వినియోగదారుడి ఇంటికి దానిని చేర్చడం మాత్రమే కాదు. సిలిండర్ భద్రత, గ్యాస్ లీకేజీని గుర్తించడం, అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలనే అంశాలపై కూడా డెలివరీ సిబ్బందికి అవగాహన ఉండాలి. కానీ బెంగళూరులో జరిగిన ఓ ఘటన ఇప్పుడు గ్యాస్ డెలివరీ సిబ్బందికి సరైన శిక్షణ అందుతోందా? అన్న ప్రశ్నను తెరపైకి తెచ్చింది.

బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో ఓ ఇంటికి గ్యాస్ సిలిండర్ అందించేందుకు వెళ్లిన డెలివరీ బాయ్‌కు అనూహ్యమైన పరిస్థితి ఎదురైంది. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పూజ కోసం వెలిగించిన దీపం ఉండగా, సిలిండర్ క్యాప్ తొలగించే సమయంలో గ్యాస్ లీక్ అయినట్లు సమాచారం. లీకైన గ్యాస్ దీపం మంటకు తగలడంతో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడ భయానక పరిస్థితి నెలకొంది. మంటలను అదుపు చేసేందుకు డెలివరీ బాయ్ ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపు తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోను పరిశీలించిన వారికి కొన్ని కీలకమైన ప్రశ్నలు తల్లెతున్నాయి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే ముందు పరిసరాలను తనిఖీ చేయాల్సిన బాధ్యత సిబ్బందికి లేదా? సిలిండర్‌లో గ్యాస్ లీకేజీ ఉందో లేదో గుర్తించే విధానంపై వారికి అవగాహన కల్పిస్తున్నారా? ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాలా? లేక వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లి అత్యవసర సేవలకు సమాచారం అందించాలా? అనే విషయాల్లో తగిన శిక్షణ ఇస్తున్నారా? అన్న చర్చ మొదలైంది.

సాధారణంగా గ్యాస్ డెలివరీ సిబ్బందికి సిలిండర్ నిర్వహణ, రెగ్యులేటర్ అమరిక, లీకేజీ గుర్తింపు, అగ్ని ప్రమాదాల నివారణ వంటి అంశాలపై శిక్షణ అవసరం. ముఖ్యంగా గ్యాస్ లీకేజీ ఉన్నప్పుడు అగ్ని వనరులకు దూరంగా ఉండటం, విద్యుత్ స్విచ్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయకపోవడం, ప్రమాదం తీవ్రతను బట్టి సురక్షిత ప్రాంతానికి వెళ్లడం వంటి జాగ్రత్తలు తెలిసి ఉండాలి. సిలిండర్‌కు మంటలు అంటుకున్నప్పుడు నీటిని పోయడం సరైన పరిష్కారం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో సొంతంగా ప్రయోగాలు చేయకుండా శిక్షణ పొందిన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాలి.

అయితే బెంగళూరు ఘటనలో డెలివరీ బాయ్‌కు శిక్షణ లేదని కేవలం వీడియో ఆధారంగా నిర్ధారించడం సాధ్యం కాదు. అతనికి ఎలాంటి శిక్షణ ఇచ్చారు? ప్రమాద సమయంలో ఏ భద్రతా చర్యలు తీసుకున్నాడు? సిలిండర్‌ను డెలివరీ చేయడానికి ముందు తనిఖీ చేశారా? అనే అంశాలపై సంబంధిత సంస్థలు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మరోవైపు గ్యాస్ ఏజెన్సీల బాధ్యతను కూడా విస్మరించలేం. సిబ్బందికి క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వడం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా మాక్ డ్రిల్స్ నిర్వహించడం, అవసరమైన భద్రతా పరికరాలు అందించడం సంస్థల బాధ్యత. కేవలం సిలిండర్లను సమయానికి డెలివరీ చేయడమే కాకుండా, సిబ్బంది ప్రాణాలకు భద్రత కల్పించడం కూడా అంతే ముఖ్యం.

ఒక చిన్న పొరపాటు ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. గ్యాస్ డెలివరీ సిబ్బందికి నిజంగా ఎంతవరకు శిక్షణ అందుతోంది? భద్రతా ప్రమాణాలు కాగితాలకే పరిమితమవుతున్నాయా? అన్న ప్రశ్నలకు గ్యాస్ పంపిణీ సంస్థలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

This post was last modified on November 5, 2026 10:36 pm

Share

Recent Posts

ఆర్-ఆర్ ట్యాక్స్ ఇంత‌లా వ‌సూలు చేస్తున్నారా?!

తెలంగాణ‌లో కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలంటే సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తిప్ర‌జ‌లు భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని మాజీ మంత్రి బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్…

1 hour ago

‘ఒరే.. మేం బానే ఉంటాం.. మీరెందుకురా గొడ‌వ ప‌డేది’

అనంత‌పురం జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు.. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ, టీడీపీ…

2 hours ago

భోగి మంటలకు మంచి అవకాశం

నవంబర్ 12 శర్వానంద్ భోగి సినిమా విడుదల. అనౌన్స్ మెంట్ ఎప్పుడో ఇచ్చారు. ఆల్రెడీ టీజర్, లిరికల్ సాంగ్ రెండూ…

2 hours ago

మెగా హీరో ఇక సింగిల్ కాదు

కొన్ని రోజుల నుంచి ప్రచారంలో ఉన్న వార్త నిజమే అని తేలింది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడైన మెగా…

3 hours ago

తిరుప‌తి ల‌డ్డూ కేసు ఏపీ దాటి వెళ్లడం ఎందుకు

తిరుమ‌ల తిరుప‌తి శ్రీవారి ప‌విత్ర ప్ర‌సాదం ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌న్న కేసు విచార‌ణ‌ను వేరే రాష్ట్రానికి బ‌దిలీ చేయాల‌ని…

3 hours ago

ఆదర్శం ఆదుకోలేదు… అనిల్ మీదే ఆశలు!

వెంకటేష్‌కు 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' ఆశించిన స్థాయిలో కలిసిరాలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా కావడంతో మొదటి నుంచి…

3 hours ago