ఫక్తు ఫార్ములా సినిమాలు చేస్తాడని.. వయొలెన్స్ శ్రుతి మించుతుందని.. లాజిక్కులు ఉండవని.. కథల్లో కొత్తదనం ఉండదని.. ఇలా బోయపాటి శ్రీను సినిమాలపై ఎన్ని విమర్శలు చేసినప్పటికీ.. ఆయన తెలుగులో మంచి డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకడు. ఆయనకు మంచి సక్సెస్ రేట్ కూడా ఉంది. ‘వినయ విధేయ రామ’కు ముందు బోయపాటి ట్రాక్ రికార్డు బాగానే ఉంది.
ప్రస్తుతం ఆయన నందమూరి బాలకృష్ణతో ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వినయ విధేయ రామ’ ప్రభావం ఏమీ కనిపించకుండా టీజర్‌తో ఈ చిత్రంపై అంచనాలు పెంచగలిగాడు బోయపాటి. ఈ మూవీతో ఆయన బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. బాలయ్య చిత్రాన్ని పట్టాలెక్కించడంలో, పూర్తి చేయడంలో కొంచెం ఆలస్యమైన నేపథ్యంలో.. తన తర్వాతి సినిమా విషయంలో వేగం చూపించాలని బోయపాటి అనుకుంటున్నాడు.
ఐతే తెలుగులో పెద్ద హీరోలెవరూ ఆయనకు ఈ ఏడాది డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అందరూ లాక్ అయి ఉన్నారు. పైగా బాలయ్య సినిమా ఫలితం చూశాక కానీ బోయపాటికి ఛాన్సిచ్చేలా లేరు. ఈ నేపథ్యంలో ఈ మాస్ డైరెక్టర్ దృష్టి ఎప్పట్నుంచో తెలుగులో సినిమా చేయాలని చూస్తున్న తమిళ స్టార్ హీరో సూర్య మీద పడ్డట్లు సమాచారం. సూర్య సైతం తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయాలని ఎప్పట్నుంచో చూస్తున్నాడు.
తెలుగు ప్రేక్షకుల మీద ప్రత్యేక ప్రేమతో స్ట్రెయిట్ తెలుగు సినిమాల లాగే ఔట్ పుట్ తీసుకొచ్చినప్పటికీ.. నేరుగా ఇక్కడ సినిమా చేయని లోటు మాత్రం సూర్యకు అలాగే ఉంది. ఈ నేపథ్యంలోనే అతను బోయపాటితో జట్టు కట్టడానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఎక్కువగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే.. అప్పుడప్పుడూ హరి లాంటి దర్శకులతో ఊర మాస్ సినిమాలు కూడా చేస్తుంటాడు సూర్య. అదే తరహాలో బోయపాటితో ఓ ద్విభాషా చిత్రం చేయాలని సూర్య అనుకుంటున్నాడట. అన్నీ కుదిరితే ఈ ఏడాదే ఈ సినిమా కార్యరూపం దాల్చొచ్చని చెబుతున్నారు.
This post was last modified on January 23, 2021 11:56 am
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…