కొన్ని రోజుల ముందు వరకు శ్రీలీల పనైపోయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టాక్ నడిచింది. తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. లెనిన్ సినిమాకు ఆమెను తప్పించి భాగ్యశ్రీ బోర్సేను తీసుకుంటే ఆమె అందం, అభినయంతో మెప్పించి తనే ఈ సినిమాకు బెస్ట్ ఛాయిస్ అనిపించింది. ఆ టైంలో శ్రీలీల మీద ట్రోల్స్ కూడా పడ్డాయి. ఈ నెగెటివిటీ చూసి శ్రీలీల కెరీర్ అయిపోయిందనే టాక్ నడిచింది.
కానీ కొంచెం గ్యాప్ తర్వాత శ్రీలీల బ్యాంగ్ బ్యాంగ్ అప్‌డేట్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఆల్రెడీ ఆమె తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ సరసన డేర్ డెవిల్ లాంటి క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్న విషయం అధికారికం అయింది. శ్రీలీల స్థానంలోకి కాయదు అనే వార్త అబద్ధమని తేలిపోయింది. ఇప్పుడు ఇంకో భారీ చిత్రంలో నటిస్తున్న విషయం వెల్లడైంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ధర్మన్ మూవీలో శ్రీలీల ఉన్న విషయం హింట్ ఇచ్చింది టీం. బుధవారం ఉదయం రిలీజ్ చేయబోయే ఒక క్యారెక్టర్ గ్లింప్స్ గురించి ఈ రోజు టీజర్ ఇచ్చారు. ఫేస్ పూర్తిగా రివీల్ చేయకపోయినా.. అక్కడున్నది శ్రీలీల అని అర్థమైపోయింది. ఆల్రెడీ ధర్మన్ మూవీలో సిమ్రన్, నయనతార లాంటి సీనియర్లకు తోడు రాశి ఖన్నా కూడా నటిస్తోంది. ఇప్పుడు శ్రీలీల లాంటి ఇంకో స్టార్ హీరోయిన్‌కు కూడా ఈ సినిమాలో చోటుండడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
మరి సూపర్ స్టార్ సినిమాలో శ్రీలీలకు ఎలాంటి పాత్ర ఇచ్చారన్నది ఆసక్తికరం. ఈ ఏడాది సంక్రాంతికి పరాశక్తి చిత్రంతో శ్రీలీల తమిళంలోకి అడుగుపెట్టింది. ఆ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ శ్రీలీలకు మంచి పేరే వచ్చింది. ఆ పేరుతోనే వరుసగా అవకాశాలు అందుకుంటున్న శ్రీలీల.. ఇక కోలీవుడ్లోనే సెటిలైపోతుందా అనిపిస్తోంది. ధర్మన్ మూవీని అశ్వత్ మారిముత్తు రూపొందిస్తుండగా.. కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. వేసవికి రిలీజ్ ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates