ఈ నగరానికి ఏమైంది.. పెళ్ళిచూపులుతో సెన్సేషన్ క్రియేట్ చేశాక తరుణ్ భాస్కర్ తీసిన సినిమా. ఎనిమిదేళ్ల కిందట ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఒక మోస్తరు ఫలితాన్నందుకుంది. కానీ కాల క్రమంలో దానికి కల్ట్ స్టేటస్ వచ్చింది. ఆన్ లైన్లో ఈ సినిమాను విపరీతంగా చూశారు యూత్. కొన్నేళ్ల ముందు ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే ఫస్ట్ రిలీజ్‌లో కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టి యూత్‌లో దీనికున్న క్రేజ్ ఎలాంటిదో చాటిచెప్పింది.
ఈ క్రేజ్ చూశాకే తరుణ్ భాస్కర్ అండ్ టీం సీక్వెల్ ఆలోచన చేసిందేమో. ఈఎన్ఈ రిపీట్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 20నే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మేకింగ్ టైంలో ఏ హడావుడి చేయకుండా, ఇప్పటిదాకా ఏ ప్రోమో రిలీజ్ చేయకుండా నేరుగా ఈ రోజు ట్రైలర్‌తో పలకరించింది టీం.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా చాలా సందడిగా చేశారు. ఈ కార్యక్రమంలో తరుణ్ భాస్కర్ తల్లి గీత భాస్కర్.. ఆసక్తికర కామెంట్ చేశారు. ఓవైపు హీరో విశ్వక్సేన్ సహా అందరూ ఈఎన్ఈ-3 గురించి మాట్లాడుతుంటే.. ఆమె మాత్రం ఆ సినిమా వద్దే వద్దు అని తేల్చేశారు. ఈ నగరానికి ఏమైందికి ఒక సీక్వెల్ తీయడానికే తరుణ్ భాస్కర్ చాలా ఒత్తిడి ఎదుర్కొన్నాడని, ఆ ప్రెజర్ తట్టుకోలేకపోయామని… విశ్వక్ ఏమో ఈఎన్ఈ-3 అంటున్నాడని.. అలాంటిదేమీ వద్దని, ఇంతటితో చాలని ఆమె అన్నారు.
పక్కనే ఉన్న తరుణ్ భాస్కర్ ఈ మాటకు నవ్వుతూ ఉండిపోయాడు తప్ప ఏమీ చెప్పలేదు. మరోవైపు తరుణ్ మాట్లాడుతూ.. ఈ నగరానికి ఏమైంది చేస్తున్నపుడు జస్ట్ ఒక బడ్డీ కామెడీ ఫిలిం తీద్దామం అని చేశామని.. కానీ సీక్వెల్ తీసేటపుడు మాత్రం ప్రేక్షకుల నుంచి దీని మీద ఉన్న అంచనాలకు భయపడుతూ సినిమా చేయాల్సి వచ్చిందని అతనన్నాడు. ఈ సినిమా కచ్చితంగా అంచనాలకు తగ్గట్లే ఉంటుందని, బాగా ఎంజాయ్ చేస్తారని అతనన్నాడు.
విశ్వక్సేన్, వెంకటేష్ కాకుమాను, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి ముఖ్య పాత్రలు పోషించిన ఈఎన్ఈ2ను సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ప్రొడ్యూస్ చేశారు. ఈ నగరానికి ఏమైందిలో సినిమా తీయడానికి ఓ కుర్రాడు, తన ఫ్రెండ్స్ గ్యాంగ్ పడే కష్టాలను చూపిస్తే.. ఇండస్ట్రీలోకి వచ్చాక ఈ గ్యాంగ్‌కు ఎదురయ్యే పరిస్థితులను చూపించాడు తరుణ్ భాస్కర్.
Gulte Telugu Telugu Political and Movie News Updates