స్వీయ దర్శకత్వంలో, ఎవరూ టచ్ చేయని జానర్ అంటూ పూర్తిగా వయొలెంట్ రూటు పట్టిన విశ్వక్ సేన్ కు ‘కల్ట్’ సైతం ఆశించిన ఫలితం ఇవ్వలేకపోతోంది. ఆదర్శ కుటుంబం ఏకె 47కి వచ్చిన మిశ్రమ స్పందనని క్యాష్ చేసుకోలేనంత వీక్ కంటెంట్ ఉండటంతో వసూళ్లు రెండో రోజుకే డ్రాపయ్యాయి. ఇక నిన్నటి నుంచి వీక్ డేస్ ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే టెక్నికల్ గా సైతం తనకు మరీ పెద్ద పేరేం రావడం లేదు. యావరేజ్ కన్నా కిందే నిలబడిపోయేలా ఉంది.
విశ్వక్ వేగంలో తప్పు లేదు. ఏడాదికి రెండు మూడు సినిమాలు ఇవ్వాలనే ఆలోచన కూడా మంచిదే. జానర్లు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. కల్ట్ లో రక్తపాతం, ఫంకీలో ఇండస్ట్రీ నేపథ్యం, లైలాలో ఆడవేషం కామెడీ, మెకానిక్ రాకీలో క్రైమ్ థ్రిల్లర్, గ్యాంగ్స్ అఫ్ గోదావరిలో సముద్ర తీరపు హింస ఇలా దేనికవే సంబంధం లేకుండా ఉన్నాయి. కానీ బాక్సాఫీస్ ఫలితాలు మాత్రం అన్నీ రాంగే. లోపం కథల్లో లేదు. దర్శకులు ఇస్తున్న ట్రీట్ మెంట్, ఆడియన్స్ ని మెప్పించలేని కథనాల్లో ఉంది.
స్వతహాగా దర్శకుడైన విశ్వక్ సేన్ ముందు గుర్తించాల్సింది ఎక్కడ లోపం ఉందనేది. టాలెంట్ పుష్కలంగా ఉన్నా ఇన్నేసి నెగటివ్ రిజల్ట్స్ రావడం ఎంత మాత్రం శుభ సంకేతం కాదు. ఫోటో షూట్ కోసం వేలాది మంది ఫ్యాన్స్ వచ్చి వెనక్కు వెళ్లడం గొప్ప కాదు. అంతే మంది థియేటర్లకు వచ్చి మన సినిమా మొదటి రోజు హౌస్ ఫుల్స్ చేయడం ఘనత అవుతుంది. విశ్వక్ ముందు కసరత్తు చేయాల్సింది ఈ విషయం మీదే. తనకో ఇమేజ్ ఉందని కాకుండా కథకు తగ్గట్టు ఒదిగిపోయే క్యారెక్టర్లు ఎంచుకోవాలి.
అశోకవనంలో అర్జునకళ్యాణం లాంటి సాఫ్ట్ జానర్ ని పక్కనపెట్టేయడం తప్పే. అది వర్కౌట్ అయిన సినిమా. తక్కువ బడ్జెట్ లో రీజనబుల్ గా పే చేసింది. సెకండ్ హీరోయిన్ గా నటించిన రితిక నాయక్ మెల్లగా బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. మిరాయ్, కొరియన్ కనకరాజు లాంటి హిట్లు కూడా పడాయి. కానీ విశ్వక్ సేన్ పరిస్థితి ఎంత మాత్రం మెరుగు పడలేదు. నెక్స్ట్ మూడు వారాల గ్యాప్ లో వచ్చే ఈ నగరానికి ఏమైంది 2, లెగసిలు చాలా పెద్ద బ్రేక్ ఇవ్వాలి. అప్పుడే కోలుకోవడం సాధ్యమవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates