Movie News

ఏడేళ్ల ముందు సినిమా రిలీజవబోతోందా?

సందీప్ కిషన్ హీరోగా తొలి అడుగులు వేస్తున్న టైంలో మొదలైన సినిమా ‘డీకే బోస్’. సినిమా అంతా పూర్తయింది. థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజైంది. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ ఎందుకో తెలియదు. ఆ సినిమా అడ్రస్ లేకుండా పోయింది.

అందరూ దాని గురించి మరిచిపోయారు. ఇక ఆ చిత్రం చరిత్రలో కలిసిపోయిందనే అనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా మొదలైన ఏడేళ్ల తర్వాత ‘డీకే బోస్’ రిలీజ్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అగ్ర దర్శకుడు హరీష్ శంకర్ ఈ మేరకు సంకేతాలిచ్చాడు.

కొన్ని సినిమాలకు ‘అహెడ్ ఆఫ్ టైమ్స్’ అని కామెంట్ వస్తుందని.. ‘డీకే బోస్’ అలాంటి సినిమానే అని.. మంచికో చెడుకో ఆ సినిమా విడుదల ఆలస్యం అయిందని.. ఆ కథను చెప్పడానికి ఇదే సరైన సమయం అని ట్వీట్ చేసిన హరీష్.. మే 7వ తేదీ వరకు అప్ డేట్ కోసం ఎదురు చూడాలని సస్పెన్సులో పెట్టాడు.

ఇన్నేళ్లు వాయిదా పడ్డ సినిమా థియేటర్లలోకి రావడం అంటే కష్టమే. అందులోనూ ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మళ్లీ థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియట్లేదు. ఈ నేపథ్యంలో ‘డీకే బోస్’ను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా డైరెక్ట్ ఆన్ లైన్ రిలీజ్ చేసే అవకాశముంది. దానికి సంబంధించిన అప్ డేటే ఇవ్వబోతున్నట్లున్నారు. ఈ చిత్రాన్ని ఆన్ బోస్ అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. సందీప్ సరసన కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ నటించింది. సంపత్ రాజ్ విలన్ పాత్రలో నటించాడు.

‘ఓయ్’ సినిమా దర్శకుడు ఆనంద్ రంగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకడు. ఇది ఒక పోలీస్ స్టోరీ. చాలా అగ్రెసివ్‌గా ఉండే యువ పోలీస్‌కు, ఒక గూండాకు మధ్య సాగే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే మరీ పాత పడ్డ చిత్రంలా అయితే కనిపించడం లేదు. మరి ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో చూడాలి.

This post was last modified on May 7, 2020 6:24 pm

Share

Recent Posts

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

8 minutes ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

2 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

2 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

2 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

3 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

6 hours ago