Movie News

పోలికల పర్వానికి శుభం కార్డు పడినట్టే

ఆదర్శ కుటుంబం ఏకె 47 షూటింగ్ జరుగుతున్న సమయంలో తెగ తిరిగిన ప్రచారం ఒకటుంది. అర్జున్ బ్లాస్ట్ జోన్ కథకు దీనికి పోలికలు ఉన్నాయని, అందుకే కీలక మార్పులు చేసి కొంత భాగం రీ షూట్ చేస్తున్నారనేది దాని సారాంశం. టీజర్ వచ్చినప్పుడు ఆ అనుమానం కొంత బలపడిన మాట నిజమే. అయితే విడుదలయ్యాక చూసుకుంటే స్టోరీ పరంగా రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కేవలం ఇంటర్వెల్ ఎపిసోడ్ దగ్గర మాత్రమే కొంచెం దగ్గరగా అనిపిస్తాయి అంతే.

త్రివిక్రమ్ శ్రీనివాస్ పూర్తిగా తన స్టైల్ ట్రీట్ మెంట్, ఎంటర్ టైన్మెంట్ జోడించి డార్క్ కామెడీని మేళవించడంతో ఆదర్శ కుటుంబం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అయితే బ్లాస్ట్ జోన్ అస్సలు గుర్తుకు రాదా అంటే వస్తుంది కానీ అది కూడా కేవలం కొన్ని నిముషాలు మాత్రమే. చిట్టిబాబుగా వెంకటేష్ చూపించిన ఎనర్జీ, తన క్యారెక్టరైజేషన్ తీర్చిదిద్దిన విధానం అన్నీ వేరుగా ఉన్నాయి. శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ సైతం వెరైటీ ఫన్ టోన్ లో సాగుతూ వినోదాన్ని పంచింది. ఇక పిల్లల పాత్రలు సరేసరి.

నిజానికి పోలికల గురించి మాట్లాడుకోవాలంటే టెంపర్, పటాస్ గురించి చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ రెండు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. రేపుకు గురైన ఒక అమాయకురాలి వల్ల హీరోలు మార్పు చెంది విలన్ల అంతు చూడటం. స్క్రీన్ ప్లే, టేకింగ్ లో వ్యత్యాసాల వల్ల ఆడియన్స్ అవి పట్టించుకోకుండా రెండింటిని సూపర్ హిట్ చేశారు. ఆదర్శ కుటుంబం, బ్లాస్ట్ జోన్ కి ఆ సమస్య లేదు. కంపారిజన్లకు ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు.

వీటి సంగతలా ఉంచితే వీకెండ్ దాకా ఆదర్శ కుటుంబంకు ఢోకా లేనట్టే. బుకింగ్స్ బాగా ఊపందుకుంటున్నాయి. గంటకు పధ్నాలుగు వేలకు పైగా బుక్ మై షో టికెట్లు అమ్ముడుపోవడం శుభ పరిణామం. ఈ జోరు సోమవారం నుంచి కూడా కొనసాగిస్తే సూపర్ హిట్ స్టాంప్ పడిపోతుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొంచెం పెద్దది కావడంతో లాభాలు రావాలంటే వీక్ డేస్ లో ఆక్యుపెన్సీలు దీపావళి దాకా స్ట్రాంగ్ గా ఉండాలి. బయ్యర్లు ఆ నమ్మకంతో ఉన్నారు. దాన్ని వెంకటేష్, త్రివిక్రమ్ ఎలా నిలబెడతారో చూడాలి.

This post was last modified on October 30, 2026 10:10 pm

Share

Recent Posts

ఇది నాకోసం కాదు – మన కోసం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ పార్టీ శ్రేణులు, నాయ‌కుల‌ను ఉద్దేశించి…

2 hours ago

మిథున్ రెడ్డి ఎక్కడున్నారు?

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందా? ఆయ‌న ఆచూకీ కూడా క‌నిపించ‌డం…

2 hours ago

బెజవాడలో వంగవీటి వన్‌మ్యాన్ షో

ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధాని అయిన విజయవాడలో ఇప్పుడు పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది. నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని కైవసం…

2 hours ago

తమన్ స్టేట్‌మెంట్‌లో ఇంత అతిశయమా

తమకు ఇష్టమైన దర్శకులను పొగుడుకోవడంలో సెలబ్రిటీలు అనుసరించే పద్ధతులు, వాడే పదాలు వేర్వేరుగా ఉంటాయి. ఒక్కోసారి ఇవి అతిశయోక్తిగా మారి…

3 hours ago

రామ రావణులలో ఎవరికి ఎక్కువ సమయం

ఇంకో ఆరు రోజుల్లో రామాయణ పార్ట్ 1 విడుదల కానుంది. చాలా ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడంతో రోజువారి…

4 hours ago

జాన్వికి డోర్స్ క్లోజ్ అయినట్లేనా?

‘పెద్ది’ సినిమా రిలీజై ఐదు నెలలు కావస్తోంది. ఆ సినిమా రిలీజ్ టైంలో జాన్వి కపూర్ పాత్రను తీర్చిదిద్దిన విధానం,…

4 hours ago