Movie News

జాన్వికి డోర్స్ క్లోజ్ అయినట్లేనా?

‘పెద్ది’ సినిమా రిలీజై ఐదు నెలలు కావస్తోంది. ఆ సినిమా రిలీజ్ టైంలో జాన్వి కపూర్ పాత్రను తీర్చిదిద్దిన విధానం, తన అప్పీయిరెన్స్ మీద పెద్ద చర్చ జరిగింది. జాన్వి సైతం పరోక్షంగా ఆ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక బ్రేక్ తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చినపుడు మళ్లీ ఈ చర్చ ఊపందుకుంది. తర్వాత సద్దుమణిగింది. అంతటితో ఆ వ్యవహారం ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ షోలో జాన్వి ఈ వివాదాన్ని మళ్లీ కదిపింది.

ఆ సినిమా వల్ల జీవితాంతం షేమ్ క్యారీ చేయాల్సి వస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలే చేసింది. ఈ చిత్రంలో కెమెరా యాంగిల్స్‌ను తప్పుబట్టింది. తన పాత్రను ప్రెజెంట్ చేసిన విధానం మీద విమర్శలు గుప్పించింది. ఐతే షూటింగ్ చేస్తున్నపుడు అభ్యంతరాలు చెప్పకుండా, రిలీజ్ ముంగిట ప్రమోషన్లలో దర్శకుడిని తెగ పొగిడేసి.. ఇప్పుడు సోషల్ మీడియా స్పందనకు అనుగుణంగా ఇలా మాట్లాడ్డం ఏంటంటూ ఆమెను తెలుగు నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

బాలీవుడ్లో ఆమె నటించిన సన్నివేశాల తాలూకు వీడియోలు పోస్ట్ చేసి గట్టిగానే ఎదురు దాడి చేస్తున్నారు. ఈ ఎటాక్ మామూలుగా లేదు. దీన్ని జాన్వి కూడా గమనిస్తూనే ఉండొచ్చు. సౌత్ సినిమాల్లో బౌండ్ స్క్రిప్టే ఉండదన్న కామెంట్‌తో టాలీవుడ్‌కే కాదు, దక్షిణాదిన మిగతా ఇండస్ట్రీలకు కూడా ఆగ్రహం తెప్పించేదే. ఓవైపు ఇండస్ట్రీ జనాలకు కోపం తెప్పించి, ఇంకోవైపు ప్రేక్షకుల్లోనూ వ్యతిరేకత తెచ్చుకుంది జాన్వి. ఈ పరిస్థితుల్లో ఇకపై ఆమెకు సౌత్ సినిమాల్లో ఇంకో అవకాశం దక్కుతుందా అన్నది సందేహమే.

తన మాటతీరు చూశాక ఎందుకొచ్చిందని ఆమె జోలికి మళ్లీ ఏ సౌత్ ఫిలిం మేకర్ వెళ్లకపోవచ్చు. ఆమెకు దాదాపుగా సౌత్ సినిమాల్లో డోర్స్ క్లోజ్ అయినట్లే. బహుశా జాన్వికి కూడా ఇక్కడ మళ్లీ సినిమా చేసే ఆలోచన లేదేమో. ఆ ఉద్దేశంతో అన్నింటికీ ప్రిపేరయ్యే ఆమె ఈ కామెంట్ చేసి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి శ్రీదేవి తనయురాలు సౌత్ సినిమాలోకి గ్రాంట్ ఎంట్రీ ఇచ్చి.. కొన్నేళ్లు తిరిగేసరికే, రెండు సినిమాలకే ఇక్కడ కెరీర్‌ను క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది.

This post was last modified on October 30, 2026 9:07 pm

Share

Recent Posts

పులివెందుల ఎన్నికల్లో హింసకు స్కెచ్?

ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు ఎంత హుందాగా వ్యవహరించాలి? ఒకవేళ కిందిస్థాయి నేతలో, కార్యకర్తలో ఆవేశపడి…

3 hours ago

చిరంజీవి చెప్పాల్సిన అసలు ముచ్చట

కొన్ని రోజులుగా నెట్ ఫ్లిక్స్ కోసం చిరంజీవి చేస్తున్న టాక్ షో 'మెగావర్స్' వార్తలు సోషల్ మీడియా, మీడియాలో తెగ…

4 hours ago

ఎంత మంచి పని చేశావ్ మాలా

ఇవాళ విడుదలైన ఆదర్శ కుటుంబం ఏకె 47 ప్రాధమిక స్పందన సానుకూలంగానే కనిపిస్తోంది. కంటెంట్ పరంగా హెచ్చుతగ్గుల మీద కొన్ని…

7 hours ago

నయనతార మీద అంత నమ్మకమా

దీపావళికి విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి రామాయణ పార్ట్ 1, సూర్య సీన్ మీద ఉంది కానీ నయనతార…

8 hours ago

చంద్రబాబు ఏమైనా జోక్ చేస్తున్నారా?

టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు తాజాగా సీరియ‌స్ అయ్యారు. ఇంత సీరియ‌స్‌గా చెబుతున్నా.. మీకు అర్ధం కావ‌డం లేదా? లేక‌..…

9 hours ago

వార‌ణాసి ఆ డేట్‌కే వ‌స్తుందా అండీ?

2027 సంవ‌త్స‌రంలో ఇండియ‌న్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో భారీ చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. కానీ వాటిలో అత్య‌ధిక అంచ‌నాలున్న‌ది వార‌ణాసి మీదే…

10 hours ago