సౌత్ ఇండియన్ సినిమాలో సీక్వెల్, ఫ్రాంఛైజీల సక్సెస్ రేట్ తక్కువ అయినప్పటికీ.. అప్పుడప్పుడూ ఓ చిత్రం పెద్ద హిట్టయి ఆ ఒరవడిని కొనసాగిస్తూనే ఉంటుంది. తాజాగా ‘జైలర్-2’ మూవీతో సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్సాపీస్ దగ్గర విధ్వంసం సాగిస్తున్నారు. ఆయన గతంలో ‘రోబో’కు సీక్వెల్ చేసి ఒక మోస్తరు ఫలితాన్ని అందుకున్నారు. మరో బ్లాక్ బస్టర్ మూవీ ‘చంద్రముఖి’ సీక్వెల్ చేయడానికి మాత్రం రజినీ ఒప్పుకోలేదు.
ఇక రజినీ సినిమాల్లో ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ‘పడయప్పా’ (తెలుగులో నరసింహా)కు సీక్వెల్ తీయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు దాని దర్శకుడు కేఎస్ రవికుమార్. కానీ రజినీనే దాన్ని ముందుకు తీసుకెళ్లట్లేదని తెలుస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఒక ఇంటర్వ్యూలో కేఎస్ రవికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నరసింహా-2 కోసం తాము చాలా సీరియస్గా పని చేశామని.. త్వరలో ఈ సినిమా ముందుకు కదలొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
‘నరసింహా’కు సీక్వెల్ తీయాలని చాలా ఏళ్ల ముందే ప్రయత్నించినట్లు రవికుమార్ తెలిపాడు. నీలాంబరి చనిపోయాక పునర్జన్మ ఎత్తి నరసింహా మీద పగ తీర్చుకునేలా ఒక కథ రెడీ చేశామని.. దాంతో పాటు వేరే లైన్ మీద వర్క్ చేశామని రవికుమార్ తెలిపాడు.
తన టీంతో కలిసి స్క్రిప్టు రెడీ చేశాక రజినీకి వినిపిస్తే ఆయనకు నచ్చిందని.. దీంతో సినిమా చేద్దామని ఆయన హామీ ఇచ్చారని రవికుమార్ తెలిపాడు. ఐతే ఈలోపు ‘పడయప్పా’ రీ రిలీజ్ అయి.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిందని, రిలీజ్ టైంలో వచ్చిన దాని కంటే ఇప్పుడు రెట్టింపు కలెక్షన్లు వచ్చాయని, టికెట్ల రేట్లు పెరగడం వల్ల ఇంత మొత్తం వచ్చి ఉండొచ్చని, అయినా సరే ఈ వసూళ్లు చాలా ఎక్కువ అని రవికుమార్ తెలిపాడు.
ఐతే రీ రిలీజ్ తర్వాత రజినీ ఆలోచన మారిందని, పడయప్పా సీక్వెల్ అంటే ప్రేక్షకుల అంచనాలు చాలా ఎక్కువ ఉంటాయని, ఇప్పుడున్న స్క్రిప్టు సరిపోదని, స్క్రీన్ ప్లే మీద ఇంకా వర్క్ చేయాలని చెప్పారని, ఆ మేరకు తన టీం పని చేస్తోందని.. దేవుడు కరుణిస్తే ఈ సీక్వెల్ కచ్చితంగా చేస్తామని రవికుమార్ అన్నారు. కానీ పడయప్పా-2కు సీక్వెల్, అది కూడా ఔట్ డేట్ అయిపోయిన రవికుమార్ దర్శకత్వంలో అంటే రజినీ అభిమానుల్లోనే చాలా భయాలున్నాయి. మరి నిజంగా ఈ ప్రాజెక్టును రజినీ, రవికుమార్ ముందుకు తీసుకెళ్తారేమో చూడాలి.
This post was last modified on October 21, 2026 5:07 pm
రాయలసీమకు సాహిత్య, సాంస్కృతిక చరిత్ర వుంది. సినిమా వాళ్ళు, కొందరు రాజకీయ నాయకుల పుణ్యమాని ఫ్యాక్షన్ ప్రాంతంగా పేరు పడిపోయింది.…
దసరా సెలవులు రణబాలికి చాలా ప్లస్ అయ్యాయి. రిలీజ్ రోజు ప్రాథమికంగా వచ్చిన పబ్లిక్ టాక్, సోషల్ మీడియా రెస్పాన్స్…
రిలీజ్ డేట్ల వాయిదాల గురించి నాగార్జున కొన్ని నెలలుగా సందర్భం దొరికినప్పుడంతా తన స్వరం వినిపిస్తూనే ఉన్నారు. లెనిన్ నుంచి…
దసరాని లక్ష్యంగా పెట్టుకుని విడుదలైన అయిదు సినిమాల్లో నాలుగు తమ టార్గెట్ ని దాదాపుగా అందుకునే పనిలో ఉండగా ఒకటి…
ఒక చిన్న సినిమా. కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్ లో తీశారు. షూటింగ్ చివరి దశలో డబ్బులు అయిపోతే దర్శకుడు…
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. పుంగనూరు, పులివెందుల, కడప, రాయచోటి…