Movie News

ఏటిగట్టు ఇంకో ఆప్షన్ వైపు చూస్తోందా

సాయిదుర్గ తేజ్ గత రెండేళ్లకు పైగా అంకితమైపోయిన సంబరాల ఏటిగట్టు గతంలో ప్రకటించిన దాని ప్రకారం జనవరి 12 వచ్చేయాలి. ఆ మేరకు అధికారిక ప్రకటన ఎప్పుడో ఇచ్చేశారు. మరుసటి రోజు చిరంజీవి కాకా ఉన్నా వెనక్కు తగ్గే పరిస్థితిలో లేమని నిర్మాత ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. అయితే క్రమంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇంకోసారి వాయిదా తప్పదేమోననే గుసగుసలు ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అదే జరిగితే నష్టం కన్నా లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఎందుకంటే సంక్రాంతికి మాములు పోటీ లేదు. మెగాస్టార్ కాకాకు ఆల్రెడీ క్రేజ్ ఉంది. నిర్మాత దిల్ రాజు పంపిణి హక్కులు తీసుకునే ప్లాన్ లో ఉన్నారని టాక్ ఉంది. ప్రమోషన్స్ మొదలయ్యాక హైప్ ఎక్కడికో వెళ్ళిపోతుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. వెంకటేష్ అనిల్ రావిపూడి కల్యాణ్ రామ్ ల జనవరి 12 విడుదల గురించి చెప్పనవసరం లేదు. పబ్లిసిటీలో పీక్స్ చూపిస్తారు. ఓపెనింగ్స్ కి ఢోకా ఉండదు. పైగా హీరో డైరెక్టర్ కాంబోకున్న క్రేజ్ దృష్ట్యా థియేటర్ బిజినెస్ భారీగా ఉంటుంది.

ప్రశాంత్ వర్మ నిర్మించిన మహాకాళి అందరికంటే ముందు ఎనిమిది వస్తుంది. దానికీ ప్రచారాలతో హోరెత్తిపోయేలా ప్లాన్ సిద్ధం చేశారట. శర్వానంద్ జార్జ్ క్రిష్, శ్రీవిష్ణు ఫ్యామిలీ ప్యాక్ పూర్తిగా వినోదాన్ని నమ్ముకుని వస్తున్నవి. ఇవన్నీ చూస్తే సంబరాల ఏటిగట్టు లాంటి సీరియస్ జానర్ వీటి మధ్య ఫిట్ కావడం అంత సులభంగా ఉండదు. పైగా ఇది ఎంటర్ టైన్మెంట్ నమ్ముకుని తీసిన సినిమా కాదు. బడ్జెట్ కూడా చాలా భారీగా పెట్టారు. తేజ్ మార్కెట్ ని మించి ఖర్చయ్యింది.

ఈ సమీకరణాలన్నీ చూసుకుని జనవరి మూడు లేదా నాలుగో వారంలో వస్తే బెటరని భావిస్తున్న తరుణంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ పోస్ట్ పోన్ వైపే మొగ్గు చూపొచ్చని వినికిడి. లేదూ రిస్క్ చేసి వస్తామంటే కంటెంట్ బలంగా ఉన్న వాళ్లే విజేతలుగా నిలుస్తారు కాబట్టి కాంపిటీషన్ కి సిద్ధపడి రంగంలోకి దూకాలి. ప్యారడైజ్, రణబాలి తరహాలో సంబరాల ఏటిగట్టు కూడా ఇంటెన్స్ సబ్జెక్టే. యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్స్ లో దర్శకుడు రోహిత్ కెపి కొత్త ప్రయోగాలు చేశారని టాక్.

This post was last modified on October 21, 2026 10:36 am

Share

Recent Posts

రావణుడు హైలైట్ అయితే ఇబ్బందే

ఇంకో పధ్నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.…

16 minutes ago

ఏపీ లోక‌ల్ వార్‌… జ‌గ‌న్ తెలుసుకోవాల్సింది ఇదే.. !

స్థానిక ఎన్నిక‌ల సమ‌రంలో ఇప్ప‌టి వ‌ర‌కు జరిగింది 25 శాతం మాత్ర‌మే!. మునిసిపాలిటీలు, మునిసిప‌ల్ కార్పొరే ష‌న్ల‌కు మాత్ర‌మే ఎన్నిక‌ల…

2 hours ago

14 ఏళ్ల కింద‌టి విడాకుల పిటిష‌న్‌పై హైకోర్టు తీర్పు

విడాకుల కేసుల‌ను గ‌రిష్ఠంగా ఏడాదిలో ప‌రిష్క‌రించాల‌ని.. సుప్రీంకోర్టు గ‌తంలోనే దేశంలోని హైకోర్టుల‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. విడాకుల కేసులలో…

2 hours ago

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి సీన్ ఇంత రివ‌ర్సా… ?

నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌మ‌కు కంచుకోట‌గా ఉంద‌ని భావించిన పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ…

3 hours ago

ఇలా అయినా హిట్టు పడుతుందా?

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో ఆయన తనయుడు మహేష్ బాబు మాత్రమే పెద్ద స్టార్ అయ్యాడు.…

4 hours ago

పాల‌పిట్ట‌ – ద‌స‌రా – స‌జ్జ‌నార్ ఆదేశాలు… అసలేంటి లింకు?

తెలంగాణ‌లో పాల‌పిట్ట‌ల‌ను విక్ర‌యించే వారికి సీపీ స‌జ్జ‌నార్ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. పాల‌పిట్ట‌ల‌ను ప‌ట్టుకున్నా.. వాటిని బంధించినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని…

10 hours ago