మైత్రి మూవీ మేకర్స్, ప్రశాంత్ నీల్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్. అయితే ఈ ఇద్దరూ కలిసి ఒక హారర్ ప్రాజెక్టుకి మద్దతుగా నిలవడమే 418 మీద అంచనాలు పెంచుతోంది. కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో రూపొందిన ఈ దెయ్యాల సినిమా ఈ వారం అక్టోబర్ 23 విడుదల కానుంది. ముందు రోజు అంటే రేపు రాత్రి పదకొండు గంటల దగ్గర సమయంలో స్పెషల్ ప్రీమియర్లు వేయబోతున్నారు. అంటే బయటికి వచ్చేసరికి మిడ్ నైట్ దాటిపోతుందన్న మాట.
ఐడియా బాగానే ఉంది కానీ పెద్దోళ్ళు తీసిన ఇలాంటి భూతాల బొమ్మకి నిజంగా ప్రేక్షకులు భయపడతారానేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే హారర్ జానర్ చాలా కాలం క్రితమే కామెడీ అయిపోయింది. నవ్వించే పేరుతో ముని నుంచి మొదలైన ట్రెండ్ ఇప్పటిదాకా కొనసాగుతూనే వస్తోంది. రాజా సాబ్ లాంటి ప్యాన్ ఇండియా మూవీలో సైతం మారుతీ హాస్యాన్నే ఎక్కువ నమ్ముకున్నారు. ఇలాంటి టైంలో వెన్నులో వణుకు పుట్టించే కంటెంట్ వస్తే అది ఖచ్చితంగా స్పెషల్ గా ఉండాలి.
418 కథ మరీ ఎప్పుడూ కననిది విననిది అనిపించడం లేదు. కాకపోతే ట్రీట్ మెంట్ లో వైవిధ్యం, భయపెట్టడంలో చూపించే క్రియేటివిటీ ఎంత బాగా పండితే జనం అంత బాగా ఆదరిస్తారు. ఒక పాడుబడిన హాస్టల్ లో ఉన్న 418 రూమ్ వెనుక దారుణమైన గతం ఒకటి ఉంటుంది. అందులో ఎవరు అడుగు పెట్టినా ప్రాణాలతో బయటికి రావడం కష్టం. అలాంటి ప్రమాదకమైన భవంతిలోకి అడుగు పెట్టిన కొందరు యువతీ యువకులు ఏమయ్యారనే పాయింట్ మీద ఇది రూపొందింది.
లైన్ వినేందుకు సింపుల్ గా అనిపించినా తెరమీద చాలా ఇంటెన్స్ తో ఉంటుందట. నిజానికి జనం దసరా పండగ నుంచి ఒక డిఫరెంట్ వైబ్ లో ఉన్నారు. జైలర్ 2 చూసి క్లాప్స్ కొట్టారు. రణబాలిని మంచి ప్రయత్నమని మెచ్చుకున్నారు. గరివిడి లక్ష్మికి గుడ్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇలాంటి టైంలో ఆత్మలు, చావులు అంటూ ఒక సీరియస్ కాన్సెప్ట్ ని చెప్పే ప్రయత్నం కనక సక్సెస్ అయితే అదో ఘనతగా నిలిచిపోతుంది. మరికొందరు ఇలాంటి సబ్జెక్టులతో ప్రయోగాలు చేసే ఛాన్స్ ఉంటుంది.
This post was last modified on October 21, 2026 12:08 pm
ఒక చిన్న సినిమా. కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్ లో తీశారు. షూటింగ్ చివరి దశలో డబ్బులు అయిపోతే దర్శకుడు…
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. పుంగనూరు, పులివెందుల, కడప, రాయచోటి…
సాయిదుర్గ తేజ్ గత రెండేళ్లకు పైగా అంకితమైపోయిన సంబరాల ఏటిగట్టు గతంలో ప్రకటించిన దాని ప్రకారం జనవరి 12 వచ్చేయాలి.…
ఇంకో పధ్నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.…
స్థానిక ఎన్నికల సమరంలో ఇప్పటి వరకు జరిగింది 25 శాతం మాత్రమే!. మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరే షన్లకు మాత్రమే ఎన్నికల…
విడాకుల కేసులను గరిష్ఠంగా ఏడాదిలో పరిష్కరించాలని.. సుప్రీంకోర్టు గతంలోనే దేశంలోని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. విడాకుల కేసులలో…