దసరా అంటే సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ కు అతి పెద్ద పండగ. పది రోజుల దాకా సెలవులు ఉంటాయి కాబట్టి జనం వినోదం కోసం ముందుగా వెళ్ళేది థియేటర్లకే. ఒక్కోసారి టాక్ తో సంబంధం లేకుండా హౌస్ ఫుల్ బోర్డులు పడిపోతాయి. తమిళ డబ్బింగ్ అనే భేదం లేకుండా ఎగబడి చూడటం ఇప్పుడే ఉంటుంది. ఇదంతా ఎప్పుడు ఉండేదే కానీ ఏదైనా సాలిడ్ అప్డేట్స్ ఇచ్చే రాబోయే మూవీస్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎదురు చూసారు కానీ వాళ్లకు కిక్ ఇచ్చే కంటెంట్ అయితే రాలేదు.
ఒకటి రెండు కాదు ఏకంగా పద్నాలుగు పైగా సినిమాలు విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్లు విడుదల చేశాయి. విరూపాక్ష, జార్జ్ క్రిష్, అలియాస్ రుక్మిణి, ఇడుపు కాగితం, రియాలిటీ, డ్యూ డేట్, హైందవ, హల్కా డాన్, కృష్ణం భజే, బబ్లూ డబుల్ ఎక్స్ ఎల్, క్యాస్ట్, మయా లేడీ అంటూ లిస్టు పెద్దదే ఉంది. వీటిలో ఒకటి రెండు తప్ప ఏవీ స్పెషల్ గా అనిపించలేదు. భారీ అంచనాలు మోస్తున్న నాగచైతన్య టీమ్ కూడా ఏదైనా స్పెషల్ గా ఇస్తుందేమో అనుకుంటే మమ అనిపించింది.
ఇలా మూవీ లవర్స్ లోటుగా ఫీలవ్వడానికి కారణం ఉంది. భారీ బడ్జెట్లతో రూపొందుతున్న క్రేజీ ప్యాన్ ఇండియా మూవీస్ ఎలాంటి విశేషాలు పంచుకోలేదు. ఫౌజీ, కింగ్ 100, కాకా, దాదా, రాకా, విశ్వంభర, వారణాసి, జనవరి 12 విడుదల ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా కూడా పెద్దదే ఉంది కానీ అన్నీ సైలెంట్ గా ఉన్నాయి. కింగ్ 100 నుంచి టబు టీజర్ వస్తుందనుకుంటే సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేశారు. షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీలు సిద్ధంగా ఉన్న స్లమ్ డాగ్ లాంటివి సైతం రిలీజ్ డేట్స్ ఇవ్వలేదు.
ఇక థియేటర్ల వద్ద చూస్తే జైలర్ 2, రణబాలి పండగ చేసుకుంటుండగా గరివిడి లక్ష్మి కూడా అనూహ్యంగా పికప్ అందుకుంది. ఒక్క క్రేజీ కళ్యాణం మాత్రమే వర్కౌట్ అయినట్టు కనిపించడం లేదు. ఒకవేళ దసరా బరిలో టయర్ 1 హీరో సినిమా ఏదైనా ఉంటే ఈపాటికి వంద కోట్ల మార్కు దాటి డబుల్ సెంచరీ వైపు పరుగులు పెట్టేది. ఆ ఛాన్స్ అయితే మిస్ అయ్యింది. రేపు ఒక్క రోజు మాత్రమే హాలిడే ఉంది. జనాలు గురువారం నుంచి రెగ్యులర్ రొటీన్ లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ వీకెండ్ దాకా వెయిట్ చేయాలి.
This post was last modified on October 20, 2026 9:49 pm
దసరా సెలవులు ముగింపుకి వస్తున్న తరుణంలో ఒక విషయం బాగా అర్థమయ్యింది. సంక్రాంతి లాగా మరో కీలకమైన సీజన్ గా…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘జైలర్-2’కు విడుదల ముంగిట పెద్దగా హైప్ ఏమీ కనిపించలేదు. ఆ సినిమా ప్రోమోలు…
రప్పా రప్పా రాజకీయాలు మనకు వద్దని, రాష్ట్రాన్ని భయం నీడలో బతికే పరిస్థితికి తిరిగి తీసుకురావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు…
ప్రతి స్టార్ హీరోకూ ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఫిలిం ఇండస్ట్రీలోనే కాక వివిధ రంగాల ప్రముఖుల్లో కూడా డై హార్ట్…
రెండు రోజుల కిందట ముంబయి వీధుల్లో జనం అంతా చూస్తుండగా.. టైగర్ ష్రాఫ్ లాంటి పేరున్న బాలీవుడ్ నటుడి మీద…
దలేర్ మెహందీ.. ఇండియాలో ఎంతో గొప్ప పేరున్న పంజాబీ సింగర్. తుణుక్ తుణుక్ తున్.. సహా ఎన్నో బ్లాక్ బస్టర్…