నవంబర్ 5 విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు పంపిణి చేయనుండటంతో పెద్ద రిలీజ్ దక్కనుంది. ఎలాగూ అప్పటికంతా జైలర్ 2, రణబాలి లాంటివి నెమ్మదించి ఉంటాయి కనక ఇబ్బంది ఉండదు. కాకపోతే అక్టోబర్ చివర్లో వస్తున్న ఆదర్శ కుటుంబం ఏకె 47, ఇట్లు అర్జున, కల్ట్ తదితర చిత్రాల టాక్స్ ఎలా ఉంటాయనే దాన్ని బట్టి వాటి సెకండ్ వీక్ రన్ ఆధారపడి ఉంటుంది. అయినా రామాయణ బృందం ఈ విషయంలో టెన్షన్ పడటం లేదు.
ముందుగా బజ్ విషయానికి వస్తే రామాయణ మీద బాహుబలి, కెజిఎఫ్ రేంజ్ అంచనాలు లేవు. ట్రైలర్లు బాగున్నాయనే పేరు తెచ్చుకున్నాయి కానీ వాటి ద్వారా భారీ ఓపెనింగ్ వస్తుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే టాలీవుడ్ ఆడియన్స్ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో రాముడి కథను చూశారు. లవకుశ నుంచి శ్రీరామ రాజ్యం దాకా బోలెడు వచ్చాయి. వాటిలో అధిక శాతం హిట్టయ్యాయి కూడా. ఇక టీవీ సీరియళ్ల రూపంలో ఎన్ని సార్లు చూశారో లెక్క ఉండదు.
ఇవాళ హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పబ్లిసిటీ మొదలుపెడుతున్నారు. రన్బీర్ కపూర్, యష్, సాయిపల్లవితో పాటు టీమ్ మొత్తం హాజరు కానుంది. అయితే రాబోయే రెండు వారాలు టీమ్ కు చాలా కీలకం కానుంది. అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఏపీ తెలంగాణ నుంచి రామాయణకు వంద కోట్ల థియేటర్ బిజినెస్ టార్గెట్ గా పెట్టుకున్నారట. అదే నిజమైతే ఈ ఎపిక్ మూవీకి యునానిమస్ టాక్ రావాలి. పిల్లా పెద్దా బారులు తీరి సినిమా చూసేందుకు ఎగబడి పోవాలి.
దర్శకుడు నితేశ్ తివారి చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. ఇది సక్సెస్ అయితేనే సీక్వెల్ కు క్రేజ్ వస్తుందని తెలిసి కూడా రెండు భాగాలుగా తీయడం ద్వారా రిస్క్ తీసుకున్నారు. పార్ట్ 1 వర్కౌట్ అయితే ఓకే లేదంటే తర్వాత వచ్చే కొనసాగింపుకి బిజినెస్ పరంగా చిక్కులు ఎదురవుతాయి. పాజిటివ్ టాక్ వస్తే మటుకు వసూళ్లకు ఆకాశమే హద్దవుతుంది. రన్బీర్ హైదరాబాద్ రావడం మొదటిసారి కాదు. బ్రహ్మాస్త్ర, యానిమల్ కోసం ప్రత్యేకంగా వచ్చి మరీ తన సినిమాలను ప్రచారం చేసుకున్నాడు.
This post was last modified on October 19, 2026 8:29 pm
ఏకంగా 4 వేల బడ్జెట్లో రూపొందుతున్న మెగా ప్రాజెక్టు.. రామాయణం. రెండు భాగాలుగా ఈ మెగా మూవీ తెరకెక్కుతుండగా.. ఫస్ట్…
ఇతర భాషలకు చెందిన సినీ జనాలు తమ సినిమాల ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చినపుడు కొంచెం కష్టపడి బాగున్నారా అని..…
ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. మాలా తెచ్చా పాలు అంటూ రామజోగయ్య శాస్త్రి…
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ మీద కాల్పుల ఘటన ఇప్పుడు దేశ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ముంబయిలో ఫుట్…
సోషల్ మీడియా జమానాలో పెద్ద సినిమాల లీకులు ఆపడం దర్శక నిర్మాతలకు చాలా కష్టమైపోయింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీటిని…
అనంతపురం జిల్లా అంటేనే రాజకీయాలకు ముఖ్యంగా ఫైర్ పాలిటిక్స్‌కు కేంద్రం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ ఈ జిల్లా…