బయోపిక్ ట్రెండ్ మళ్ళీ మొదలైపోయింది. మహానటి సావిత్రి టైంలో ఈ జానర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ సిరీస్ ఆశించినంత విజయం సాధించకపోయినా బాలయ్య ప్రయత్నం ప్రశంసలు అందుకుంది, సినీ, రాజకీయ, క్రీడల నేపథ్యంలో గత పదేళ్లలో చెప్పుకోదగ్గ మూవీస్ బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇది రీ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే లెజెండరి గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి గారి బయోపిక్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చడం అంచనాలు పెంచుతోంది. ఇదిలా ఉండగా మరో సుప్రసిద్ధ గాయని కథకు తెరరూపం కల్పించేందుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం. ఏఆర్ రెహమాన్ నిర్మాణంలో ఇండియన్ నైటింగేల్ గా ప్రసిద్ధి చెందిన పి సుశీలగారి జీవితాన్ని త్వరలో వెండితెరపై చూసే ఛాన్స్ దక్కనుంది. ఇందులో ఆవిడ క్యారెక్టర్ ని రుక్మిణి వసంత్ పోషించబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.
పి సుశీల గారి వయసు 90 సంవత్సరాలు. ఇప్పటికీ చెన్నైలోనె నివాసం ఉంటున్నారు. కొన్ని వారాల క్రితం ఎస్ జానకి గారు కాలం చేసినప్పుడు తీవ్ర ఆవేదన చెందినట్టు సన్నిహితులు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేత పద్మ భూషణ్ పురస్కారం అందుకున్న సుశీల పేరు మీద అత్యధిక పాటలు పాడిన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు ఉంది. అయిదుసార్లు నేషనల్ అవార్డు అందుకున్నారు. ఒక్క తమిళంలోనే ఆరు వేలకు పైగా పాటలు పాడగా తెలుగులోనూ ఆ సంఖ్య దానికి దగ్గరగా ఉంటుంది.
సుశీల గారి స్వస్థలం విజయనగరం. పద్నాలుగు పైగా భాషల్లో వేల పాటలు పాడి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. ఆవిడ జీవితం నుంచి నేర్చుకోవాల్సింది, చదువుకోవాల్సింది చాలా ఉంది. రుక్మిణి వసంత్ కి ఇది బంగారం లాంటి అవకాశం. గత కొంత కాలంగా సరైన పాత్రలు లేక వరస ఫ్లాపులు చూస్తూ ఆశలన్నీ జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మీద పెట్టుకుంది. ఈలోగా సుశీల గారి క్యారెక్టర్ దక్కడం అదృష్టమే. అందులోనూ రెహమాన్ సంగీతమంటే మ్యూజిక్ లవర్స్ కు అంతకంటే కావాల్సింది ఏముంది.
This post was last modified on October 19, 2026 5:37 pm
ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. మాలా తెచ్చా పాలు అంటూ రామజోగయ్య శాస్త్రి…
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ మీద కాల్పుల ఘటన ఇప్పుడు దేశ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ముంబయిలో ఫుట్…
సోషల్ మీడియా జమానాలో పెద్ద సినిమాల లీకులు ఆపడం దర్శక నిర్మాతలకు చాలా కష్టమైపోయింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీటిని…
అనంతపురం జిల్లా అంటేనే రాజకీయాలకు ముఖ్యంగా ఫైర్ పాలిటిక్స్‌కు కేంద్రం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ ఈ జిల్లా…
నవంబర్ 5 విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు పంపిణి చేయనుండటంతో పెద్ద రిలీజ్…
జైలర్ 2 సక్సెస్ తర్వాత సోషల్ మీడియా యువతకు ఒక పెద్ద సందేహం వస్తోంది. మన సీనియర్లు కూడా ఇలా…