ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలో పాల్గొన్న ప్రసిద్ధ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్ కు దేశం విడిచి వెళ్లి పొమ్మంటూ పోలీసులు ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈనెల 28 వ తేదీ లోపున భారత్ విడిచి వెళ్లాలని టైం బాండ్ విధించినట్లు మీడియా పేర్కొంది.
జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇటీవల ముంబై క్రాంతి మైదానం వద్ద కాక్రోచ్ ల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఈ నిరసనల్లో నటుడు ఇమ్రాన్ పాల్గొన్నారు. ఆయనతోపాటుగా పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబందించి బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య ఫిర్యాదు చేశారు. విదేశీ పౌరసత్వం కలిగిన ఇమ్రాన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిజానికి ఇమ్రాన్ ఖాన్ కు అమెరికా పౌరసత్వంతో పాటుగా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓఐసీ) కార్డు వుంది. అయితే ఈ కార్డు హోల్డర్ భారత్ లో అన్నీ రకాల సౌకర్యాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ దేశ పౌరసత్వంతో సమానం కాదని అధికారులు చెబుతున్నారు. విదేశీ పౌరులకు ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయో అలాంటి నిబంధనలు ఓఐసీ కార్డుదారుడి వర్తిస్తాయి. ఈ నిబంధనల ప్రకారం ఇమ్రాన్ నిరసనల్లో పాల్గొన కూడదని బీజేపీ వాదిస్తుంది. పోలీసు అధికారులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది.
పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే వదిలిపెట్టారు. అయితే దేశం వదిలి వెళ్లమని పోలీసులు ఆదేశించడంపై భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. పోలీసుల ఆదేశాల ప్రకారం అమెరికా వెళ్లేందుకు సరంజమా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates