ఇమేజ్ ఉన్న హీరోలతో సినిమా వేగంగా తీయడమనేది దర్శకులకు పెద్ద సవాల్ గా మారిపోయింది. నో కాంప్రోమైజ్ పేరుతో నెలలు సంవత్సరాలు గడిపేస్తున్న డైరెక్టర్లు టాలీవుడ్ నిండా ఉన్నారు. ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు ఇచ్చే నాని సైతం ఇప్పుడు సంవత్సరానికి ఒకటి ఇవ్వడమే కష్టమనే స్థాయికి బడ్జెట్, మార్కెట్ రెండూ పెంచుకున్నాడు. అయితే తను నిర్మాతగా వ్యవహరిస్తున్న అలియాస్ రుక్మిణి నిర్మాణం పలువురికి ఆదర్శంగా నిలిచేలా షూటింగ్ జరుపుకుంటోంది.
ఏదో నిన్నో మొన్నో ఇచ్చినట్టు అలియాస్ రుక్మిణి అనౌన్స్ మెంట్ ఇంకా అభిమానుల మనసులో ఫ్రెష్ గా ఉంది. కానీ షూట్ చకచకా పరుగులు పెడుతూ చివరి దశకు వెళ్ళిపోతోంది. అంటే కేవలం మూడు నెలలకు కొంచెం అటుఇటుగా దర్శకుడు మురళీకాంత్ పక్కా ప్లానింగ్ తో దీన్ని తెరకెక్కిస్తున్న విధానం నాని సోదరి నిర్మాత ఘంటా దీప్తితో మెప్పులు పొందేలా చేసిందట. వరస డిజాస్టర్లతో బాగా వెనుకబడిన నితిన్ కి ఈ సినిమా హిట్ కావడం మాములు అవసరం కాదు, ఎమర్జెన్సీ అని చెప్పాలి.
ఒక నవలా రచయితకి , హిట్లర్ లా ప్రవర్తించే ఒక స్కూల్ టీచర్ కి మధ్య ప్రేమకథకు ఒక వెరైటీ రొమాంటిక్ టచ్ ఇచ్చి మురళికాంత్ దీన్ని తీర్చిదిద్దుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. టేకింగ్, డైలాగులు, స్క్రీన్ కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా ఉంటాయని టాక్. బడ్జెట్ పరంగా ఏ మాత్రం రిస్క్ లేకుండా చాలా రీజనబుల్ గా అయిపోతుందని సమాచారం. డిజిటల్ హక్కులకు నాని బ్రాండ్ వల్ల మంచి ఆదాయమే చేకూరుతుంది. థియేటర్ బిజినెస్ భారీగా చేయరు కాబట్టి రికవరీ వేగంగా ఉంటుంది.
హీరోయిన్ గా ఆఫియా సయీద్ ని తీసుకోవడం కొత్త ఫీల్ ఇస్తోంది. టీజర్ లో చూపించిన లుక్స్, నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. అలియాస్ రుక్మిణి అంటే కథ ప్రకారం ఆమె పేరు కాదట. హీరో తన రచనలకు పెట్టుకునే పెన్ నేమ్ అని వినికిడి. ఇలా మూడు నెలల ప్రొడక్షన్ మోడల్ ని మీడియం రేంజ్ హీరోలు అధిక శాతం ఫాలో అ మూడుయితే నెలకు కనీసం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చి థియేటర్ బుకింగ్స్ బాగుంటాయి. అలియాస్ రుక్మిణికి పోటీగా నాగచైతన్య వృషకర్మ, విశ్వక్ సేన్ లెగసి ఉన్నాయి.
This post was last modified on October 14, 2026 11:27 am
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. ఎక్కడికి అక్కడ నాయకులు పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున…
ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న 'స్పిరిట్' మార్చి 5 విడుదలని ఎప్పుడో లాక్ చేసుకున్న సంగతి…
నిన్న జరిగిన రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ తన మీదే అందరి కంటే…
దీపావళికి రామాయణ, సూర్య సీన్,. కిరణ్ అబ్బవరం నిర్మించిన హతతో పోటీ నెలకొనగా ఆ తర్వాత వారం శర్వానంద్ భోగి…
వీరమణి.. ఇప్పుడీ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. మంచు విష్ణు సైతం ఈ పేరు వాడి ఒక ట్వీట్…
80, 90 దశకాల్లో తన డిస్కో డ్యాన్సులతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన నటుడు మిథున్ చక్రవర్తి. ఇప్పటికీ…