నీతి టేలర్.. ఈ పేరు గుర్తుందా? ‘నచ్చావులే’ ఫేమ్ తనీష్ అల్లాడి హీరోగా నటించిన ‘మేం వయసుకు వచ్చాం’ అనే చిత్రంతో 2012లో తెలుగులోకి అడుగుపెట్టిందీ ఉత్తరాది అమ్మాయి. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రినాథరావు నక్కినకు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. దీని తర్వాత నీతి.. రాహుల్ రవీంద్రన్ హీరోగా రామకృష్ణ మచ్చకంటి డైరెక్షన్లో ‘పెళ్లిపుస్తకం’ అనే మరో సినిమా చేసింది.
ఆపై ‘క్షేమంగా వెళ్ళి లాభంగా రండి’ దర్శకుడు రాజా వన్నెం రెడ్డితో ‘లవ్ డాట్ కామ్’ అనే మరో సినిమా కూడా చేసింది. కానీ తన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో నీతికి మళ్లీ తెలుగులో అవకాశాలు రాలేదు. తన మాతృభాష హిందీలో కూడా ఛాన్సులేమీ లేకపోవడంతో ఆరేళ్ల ముందు పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడింది నీతి. ఐతే అందరూ మరిచిపోయిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఒక సంచలన ఆరోపణతో వార్తల్లోకి వచ్చింది.
తనను ఒక దక్షిణాది దర్శకుడు వేధించిన విషయాన్ని ఆమె బయటపెట్టింది. తాను సౌత్లో ఒక సినిమా చేశాక.. దాని దర్శకుడు తనకు కాల్ చేశాడని, తన తర్వాతి సినిమాలోనూ అవకాశం ఇస్తానని, కానీ అందుకోసం తన కోరిక తీర్చాలని అడిగాడని.. దీంతో తాను భయపడిపోయి అతణ్ని బ్లాక్ చేశానని ఆమె వెల్లడించింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయినట్లు ఆమె తెలిపింది. తాను దక్షిణాదిన సినిమాలు మానేయడానికి ఇదే కారణమని నీతి వెల్లడించింది.
తాజాగా ఒక పాడ్కాస్ట్లో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి నీతి టేలర్ వెల్లడించడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి నీతిని అలా వేధించిన దర్శకుడు ఎవరు అంటూ నెటిజన్లు గెస్సింగ్లోకి వెళ్లిపోయారు. నీతి చేసినవి తక్కువ సినిమాలే కావడం.. ఆ చిత్రాల దర్శకుల వైపు అనుమానంగా చూస్తున్నారు నెటిజన్లు. ఐతే ఇందులో అసలు దోషి ఎవరో కానీ.. నీతి చేసిన ఈ ఆరోపణ వల్ల మిగతా ఇద్దరిని కూడా అనుమానించే పరిస్థితి వస్తోంది. ఇది ఆ ఇద్దరికీ తీవ్ర ఇబ్బంది కలిగించేదే.
This post was last modified on October 14, 2026 6:29 am
80, 90 దశకాల్లో తన డిస్కో డ్యాన్సులతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన నటుడు మిథున్ చక్రవర్తి. ఇప్పటికీ…
దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…