Movie News

రజినీ కొట్టకూడదని కండిషన్

80, 90 దశకాల్లో తన డిస్కో డ్యాన్సులతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన నటుడు మిథున్ చక్రవర్తి. ఇప్పటికీ డిస్కో డ్యాన్సులంటే అందరికీ మిథునే గుర్తుకు వస్తాడు. పేరుకు బెంగాలీ నటుడైనప్పటికీ.. బాలీవుడ్లో అతను గొప్ప పేరే సంపాదించాడు. దేశవ్యాప్తంగా అభిమానులను తెచ్చుకున్నాడు. ఈ లెజెండరీ నటుడికి వయసు మీద పడ్డప్పటికీ.. ఇంకా చురుగ్గా సినిమాలు చేస్తున్నాడు.

ఆయన దక్షిణాది సినిమాల్లో కూడా అప్పుడప్పుడూ తళుక్కుమంటున్నాడు. తెలుగులో ‘గోపాల గోపాల’ చిత్రంలో మిథున్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘జైలర్-2’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ చిత్రం ఆయన చక్రాల కుర్చీకి పరిమితమైన పాత్ర చేశాడు. ఈ క్యారెక్టర్ ‘బ్రేకింగ్ బ్యాడ్’లోని విక్టర్ సాలమాంకా పాత్రను గుర్తుకు తెస్తోంది.

‘జైలర్-2’లో మిథున్ పాత్ర నెగెటివ్ షేడ్స్ ఉన్నదే. రజినీ సినిమాలో విలన్ పాత్ర అంటే.. ఆయన చేతిలో దెబ్బలు తినక తప్పదు కదా? కానీ తన పాత్ర అలా ఉంటే ‘జైలర్-2’ సినిమా చేయననేశాడట మిథున్. రజినీ చేతిలో దెబ్బలు తినడం, ఆయన చేతిలో చావడం తనకు ఇష్టం లేదని.. అందుకే ఆయన తనను కొట్టను, గన్నుతో కాల్చను అంటేనే ఈ సినిమా చేస్తానని మిథున్ కండిషన్ పెట్టాడట. ఈ విషయాన్ని ‘జైలర్-2’కు సంబంధించిన ఈవెంట్లో రజినీనే స్వయంగా వెల్లడించాడు.

ఈ కండిషన్ గురించి దర్శకుడు నెల్సన్‌ దిలీప్ కుమార్‌తో మాట్లాడి చెబుతానని రజినీకాంత్.. మిథున్‌కు చెప్పాడట. ఆయన కండిషన్ మేరకే రజినీ ఆయన్ని కొట్టకుండా, కాల్చకుండా ఉండేలా ఈ పాత్రను డిజైన్ చేశాడట నెల్సన్. ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, విద్యాబాలన్, సూరజ్.. ఇలా చాలామంది విలన్లే ఉన్నారు. సన్ పిక్చర్స్ దర్శకత్వంలో దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ గురువారమే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

This post was last modified on October 14, 2026 6:26 am

Share

Recent Posts

ఆ నటిని వేధించిన దర్శకుడెవరు?

నీతి టేలర్.. ఈ పేరు గుర్తుందా? ‘నచ్చావులే’ ఫేమ్ తనీష్ అల్లాడి హీరోగా నటించిన ‘మేం వయసుకు వచ్చాం’ అనే…

4 hours ago

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

7 hours ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

8 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

10 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

10 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

10 hours ago