Movie News

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా, ప్యాన్ ఇండియా మూవీగా బజ్ ఓ రేంజ్ లో ఉండాల్సిన రణబాలి క్రమంగా హైప్ పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. వీటి స్థాయికి తగ్గ వాతావరణం ఇంకా ఏర్పడలేదని బయ్యర్ వర్గాల అభిప్రాయం. ఇంత టైట్ పోటీలోనూ చిన్న సినిమాలు తమ లక్కును ట్రై చేస్తున్నాయి. వాటిలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గరివిడి లక్ష్మి ఒకటి.

ఆనంది టైటిల్ రోల్ పోషించిన ఈ రియల్ లైఫ్ బయోపిక్ కి గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. ఇండస్ట్రీ ప్రముఖులకు హైదరాబాద్ విమల్ థియేటర్ లో నాలుగు రోజుల ముందే ప్రీమియర్ షో వేయడం విశేషం. రెస్పాన్స్ పాజిటివ్ గా కనిపిస్తోంది. ఇది ఎంత మేరకు నిజమో సాధారణ ప్రేక్షకులు చూశాక క్లారిటీ వస్తుంది. ఒకేరోజు ఎవరితోనూ క్లాష్ లేకుండా అక్టోబర్ 17 ఎంచుకున్న గరివిడి లక్ష్మిని టిజి విశ్వప్రసాద్ నిర్మించారు. చాలా కాలంగా వాయిదా పడిన మూవీ ఇది.

90 దశకాన్ని ఊపేసిన ఉత్తరాంధ్ర కళాకారిణి జీవితం ఆధారంగా ఇది రూపొందింది. ఆవిడ ఎంత పాపులర్ అంటే ఒక పాటలోని కొంత భాగాన్ని ఆర్పి పట్నాయక్ తన డెబ్యూ మూవీ చిత్రంలో వాడుకునేంత. అయితే ఇప్పటి జనరేషన్ కు అంతగా తెలియని ఒక బుర్రకథ గాయని జీవితాన్ని రెండున్నర గంటలు జనం తెరమీద చూడగలరా అంటే కథనాన్ని ఎంత ఎంగేజింగ్ గా నడిపించారనే దాన్ని బట్టి ఉంటుంది. రజనీకాంత్, విజయ్ దేవరకొండ హడావిడి మధ్య గరివిడి సౌండ్ అయితే కొంత వినపడుతోంది.

మంచి ప్రయత్నమనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో అది కనక నిజమైతే మటుకు కమర్షియల్ గానూ ప్రాజెక్టు సేఫ్ అవుతుంది. కాకపోతే కాంపిటీషన్ ఎక్కువ కావడం వల్ల తగినన్ని స్క్రీన్లు అందుబాటులో ఉండకపోవచ్చు. గరివిడి లక్ష్మికి పోటీగా అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కళ్యాణం కూడా బరిలో ఉంది. రెండు పెద్ద మూవీస్ తో రెండు చిన్న సినిమాలు తలపడటం ఆసక్తికరంగా ఉంది. ఎవరు విజేతలవుతారని తేలడానికి ఇంకో మూడు నాలుగు రోజులు వెయిట్ చేస్తే చాలు.

This post was last modified on October 13, 2026 10:33 pm

Share

Recent Posts

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

1 hour ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

3 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

3 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

4 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

7 hours ago