నవంబర్ ఇరవై… పోటీకి అందరూ సైసై

దీపావళికి రామాయణ, సూర్య సీన్,. కిరణ్ అబ్బవరం నిర్మించిన హతతో పోటీ నెలకొనగా ఆ తర్వాత వారం శర్వానంద్ భోగి ఒకటే అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అయితే నవంబర్ 20 కాంపిటీషన్ ఆసక్తి రేపెలా ఉంది. ఒకవేళ అక్టోబర్ 30 కనక ఆదర్శ కుటుంబం ఏకే ఫార్టీ సెవెన్ రిలీజ్ కాకపోతే ఆపై నెల మూడో వారానికి వెళ్తుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో నిర్మాతలు ఒక్కొక్కరుగా అలెర్ట్ అవుతూ ఆ డేట్ మీద కర్చీఫ్స్ వేయడం మొదలుపెట్టారు. ఇది ఒక రకంగా అడ్వాన్స్ సేఫ్ గేమ్ లాంటిది.

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ నవంబర్ ఇరవై లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. మొదటి భాగం భారీ బ్లాక్ బస్టర్ కాకపోయినా క్రమంగా దానికి కల్ట్ స్టేటస్ వచ్చి రీ రిలీజులో రికార్డులు సృష్టించింది. అందుకే నిర్మాతలు అప్పటికప్పుడు పార్ట్ 2 నిర్ణయం తీసుకుని బడ్జెట్ కూడా భారీగానే కేటాయించారు.

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ మీద ఇండస్ట్రీ వర్గాల్లో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. ఆకాశం నీ హద్దురా తరహాలో ఒక మంచి ఎమోషనల్ బయోపిక్ అవుతుందని టీమ్ నమ్ముతోంది. పవన్ సాధినేని దర్శకత్వం గురించి బాగా మాట్లాడుతున్నారు. సత్యదేవ్ ‘సమవర్తి’ని తక్కువ అంచనా వేయడానికి లేకుండా మంచి పబ్లిసిటీని ప్లాన్ చేస్తున్నారు. ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల కాంబోలో తెరకెక్కుతున్న ‘ఓమ్ చాప్టర్ 1’ కూడా నవంబర్ 20నే వస్తోంది.

ఇంకా నెల రోజులకు పైగానే సమయం ఉన్నప్పటికి దసరా కావడం ఆలస్యం వీటి ప్రమోషన్లను వేగవంతం చేయడానికి ఆయా టీమ్స్ రెడీ అవుతున్నాయి. దీపావళికి వచ్చే వాటికి రెండు వారాల గ్రౌండ్ వదిలేశాక ఆ తర్వాత క్రమం తప్పకుండా కొత్త రిలీజులు క్యూ కడుతున్నాయి. డిసెంబర్ లో కూడా బాక్సాఫీస్ టైట్ గా ఉండటంతో ఎవరూ వెనక్కు తగ్గే ఆలోచనలో లేరు. ఒకవేళ ఆదర్శ కుటుంబం కనక అక్టోబర్ చివర్లో కాకుండా నవంబర్ అంటే మాత్రం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి.