లెజెండరీ నటుడు నానా పటేకర్ నిన్న తెల్లవారుజామున హఠాత్తుగా మరణించడం ఆయన అభిమానులను విషాదంలో ముంచెత్తింది. నానాకు 75 ఏళ్లు వచ్చాయి కాబట్టి ఆల్రెడీ ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ మంచం పట్టారేమో అనుకున్నారు చాలామంది. కానీ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. చాలా యాక్టివ్‌గానే ఉంటూ సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో అంత గొప్ప నటుడు ఇలా హఠాత్తుగా చనిపోవడం తన అభిమానులకు పెద్ద షాకే.
ఆ వయసులోనూ చాలా ఫిట్‌గా కనిపిస్తున్న మనిషి ఇలా చనిపోవడం కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ కూడా తట్టుకోలేకపోతున్నారు. మూడు రోజుల ముందే ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. రేపు ఉంటామో లేదో తెలియదంటూ నానా వ్యాఖ్యానించడం చూసి లైఫ్ ఎంత అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుందో, విధి ఎంత చిత్రమైందో అని అందరూ చర్చించుకుంటున్నారు.
నిజానికి నానాకు తన ఆరోగ్యం విషయంలో ముందే ఆందోళన కలిగిందట.
ఆయన తన మిత్రుడు ఒకరికి ఈ విషయమై మెసేజ్ కూడా చేశారట. కానీ అర్ధరాత్రి సమయం కావడంతో ఆ ఫ్రెండు మెసేజ్ చూసుకోలేకపోయారట. ఆ మిత్రుడు కనుక మెసేజ్ చూసి ఉంటే నానా మరణించేవారే కాదట. ఈ విషయాన్ని నానాకు చికిత్స చేసిన వైద్యుడే వెల్లడించారు. అర్ధరాత్రి 2.30 గంటలకు నానా.. ఒక ఫ్రెండుకు మెసేజ్ చేశారని, తనకు ఒంట్లో ఇబ్బందిగా ఉందన్నది ఆ మెసేజ్ సారాంశమని శేఖర్ సల్కార్ అనే వైద్యుడు చెప్పారు.
ఐతే ఆ టైంలో ఆ స్నేహితుడు నిద్ర పోతుండడంతో మెసేజ్ చూసుకోలేదని.. ఐతే ఇబ్బంది పెరగడంతో తర్వాత నానా స్వయంగా ఫోన్ చేశాడని.. అప్పుడు ఆ మిత్రుడు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నానా ఇంటికి చేరుకున్నాడని.. కానీ అప్పటికే ఆయన అపస్మారక స్థితికి చేరుకున్నారని వైద్యుడు వెల్లడించాడు.
వెంటనే అంబులెన్సును రప్పించి ఆసుపత్రికి తీసుకురాగా.. ముప్పావు గంట పాటు కార్డియాక్ మసాజ్ చేసినా నానాను తాము కాపాడలేకపోయామని చెప్పాడు. ఒకవేళ 2.30కి నానా పంపిన మెసేజ్ చూసి ఉన్నా.. లేదా అప్పుడే నానా నేరుగా కాల్ చేసి ఉన్నా.. ఆయన బతికి ఉండేవారని స్పష్టమవుతోంది.
This post was last modified on October 9, 2026 5:36 pm
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…
థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…