విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి అక్టోబర్ 16 విడుదలకు రెడీ అవుతోంది. గత కొద్దిరోజులుగా ప్రమోషన్లలో భాగంగా విజయ్, రష్మిక మందన్న ఇస్తున్న ఇంటర్వ్యూలలో వ్యక్తిగత విషయాలు ఎక్కువ హైలైట్ కావడంతో అసలు సినిమాలో ఎలాంటి కంటెంట్ ఉంటుందనే ఆసక్తి సామాన్య ప్రేక్షకులకు సస్పెన్స్ గానే ఉంది. దానికి సమాధానం ఇవ్వడం కోసం ఏకంగా నాలుగు నిమిషాల ట్రైలర్ కట్ విడుదల చేశారు.
లెంగ్త్ ఎక్కువ కాబట్టి కథను దాచే ప్రయత్నం చేయలేదు.రెండు వందల సంవత్సరాల క్రితం అనంతపురం సింగనమల ప్రాంతంలో ఎత్తైన అవధూత కొండ మీద అనాథలా చేరుకున్న తల్లికి పుడతాడు రణబాలి(విజయ్ దేవరకొండ). అక్కడి కరువును ఆసరాగా చేసుకున్న బ్రిటిషర్లు తిండి పేరుతో లక్షలాది ప్రజలను బానిసలుగా చేసుకుంటారు. వీళ్ళ మీద తిరుగుబాటు ప్రకటించిన రణబాలి వాళ్ళ కంటికి నిద్ర లేకుండా చేస్తాడు. తెల్లదొరలను ఊచకోత కోస్తాడు. అదెలానేది తెరమీద చూడాలి.
దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తీసుకున్నది చాలా రిస్క్ అనిపించే కాన్సెప్ట్. స్వాతంత్రం రాక ముందు రాయలసీమలోని ఒక ప్రాంతంలో జరిగిన అమానవీయ సంఘటనలను ఆధారంగా తీసుకుని ఈ కథను అల్లుకున్నాడు. రణబాలి పాత్ర డిమాండ్ అనుగుణంగా వయొలెన్స్ కూడా అవసరమైన మోతాదు కంటే ఎక్కువే పెట్టినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ లార్జర్ దాన్ లైఫ్ పాత్రలో పీక్స్ పెర్ఫార్మన్స్ చూడొచ్చనేలా ఉంది. రష్మిక మందన్నకు కూడా స్కోప్ దక్కింది.
ప్రీ ఇండిపెండెన్స్ నేపధ్యం కావడంతో అప్పటి వాతావరణాన్ని ప్రతిమబింబించేలా చేసిన ఆర్ట్ వర్క్ సహజంగా ఉంది. మమ్మి విలన్ ఆర్నాల్డ్ రోస్లో ఇందులో పాత్ర చేయడం ప్రత్యేకంగా నిలుస్తోంది. హింస మోతాదు కాస్త ఎక్కువగా దట్టించినట్టు అనిపిస్తున్నా స్టోరీ డిమాండ్ మేరకు ఆ మాత్రం ఉంటేనే ఎమోషన్, యాక్షన్ పండుతుంది కాబట్టి రాహుల్ ఆ పద్దతిని ఫాలో అయిపోయారు. దసరా సెలవుల్లో మంచి టైం చూసుకుని వస్తున్న రణబాలి అంచనాలు అందుకుంటే మటుకు రౌడీ బాయ్ కు హిట్టు పడ్డట్టే.
This post was last modified on October 8, 2026 10:31 pm
అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…
ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…
ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…
ఎంత పెద్ద స్టార్ హీరోకైనా డిజాస్టర్లు సహజం. ఎన్టీఆర్ ఎంజిఆర్ నుంచి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ అనుభవమే.…
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు…
ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…