బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, రీసెంట్ గా వచ్చిన అఖండ 2.. ఇప్పుడు సెట్స్ పై ఉన్న దాదా వరకు అదే పేరు రిపీట్ అవుతోంది. మధ్యలో డైరెక్టర్లు మారుతున్నారు, కథల టోన్ మారుతోంది. కానీ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మాత్రం బాలయ్య కాంపౌండ్ వేరే ఆప్షన్ వైపు అస్సలు చూడట్లేదు.
బాలయ్య తన కెరీర్ లో తమన్ కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో చేసిన చివరి సినిమా రూలర్. 2019లో వచ్చిన ఆ సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ ఇచ్చారు. అంతకుముందు గౌతమీపుత్ర శాతకర్ణి, జైసింహాకు కూడా ఆయనే పని చేశారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. తమన్ ఫస్ట్ టైమ్ బాలయ్యకు అఖండతో మ్యూజిక్ ఇవ్వలేదు. 2016లోనే డిక్టేటర్ సినిమాకు పనిచేశాడు. కానీ అఖండ సెట్ చేసిన ట్రెండ్ తో ఈ కాంబో అలా కంటిన్యు అవుతూనే ఉంది.
దీనికి మెయిన్ రీజన్ బాలయ్య మాస్ ఇమేజ్ కు తగ్గ సౌండ్ దొరకడమే. ఆయన స్క్రీన్ మీదకు వస్తే ఎంట్రీ, డైలాగ్, ఫైట్ సీన్.. ఇలా ప్రతిదానికీ బీజీఎం ఒక రేంజ్ లో మోత మోగిపోవాలి. అఖండలో తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేశాయి. అప్పటి నుంచి బాలయ్య ఎలివేషన్ సీన్ పడిందంటే అక్కడ తమన్ మార్క్ డ్రమ్స్ మోగాల్సిందే అన్నంతగా ఆడియన్స్ కు అలవాటైపోయింది.
బాలయ్య దగ్గరకు వచ్చే డైరెక్టర్లు కూడా రిస్క్ చేయడం లేదు. బోయపాటి, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బాబీ.. ఇలా ఒక్కొక్కరి మేకింగ్ స్టైల్ వేరు. అయినా సరే బాలయ్య ఆరాకు సరిపోయే సౌండ్ కోసం వీళ్లంతా మళ్లీ తమన్ దగ్గరికే వెళ్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర బాగా వర్కౌట్ అయిన హిట్ కాంబినేషన్ ను అనవసరంగా ఎందుకు మార్చాలి అన్నది వీళ్ల ఆలోచన కావచ్చు. అయితే బాలయ్య తమన్ కంటే ముందు కీరవాణి, మణిశర్మ, అనూప్ లాంటి వాళ్లతో సినిమాలు చేశారు. భవిష్యత్తులో మరో న్యూ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినా కచ్చితంగా తమన్ తో పోలిక ఎదుర్కోక తప్పదు. ఇక నెక్స్ట్ కొరటాల ఏమైనా ఈ కాంబినేషన్ ను బ్రేక్ చేస్తాడేమో చూడాలి.
This post was last modified on October 8, 2026 7:07 pm
విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…
అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…
ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…
ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…
ఎంత పెద్ద స్టార్ హీరోకైనా డిజాస్టర్లు సహజం. ఎన్టీఆర్ ఎంజిఆర్ నుంచి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ అనుభవమే.…
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు…