అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్ చేసుకుని కొందరు, జైలర్ 2కి మద్దతు ఇచ్చి ఈ సినిమా చూడొద్దని మరికొందరు, అసలు కంటెంట్ ఎలా ఉందో తెలియకుండానే నెగటివ్ కామెంట్స్ చేస్తున్న బ్యాచ్ ఇంకొకటి ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళే జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో టీమ్ వీటి గురించి స్పందిస్తూ పలు ఇష్యూస్ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మహాత్మాగాంధీ వరకు ఎవరినీ వదలకుండా ట్రోలింగ్ చేస్తున్న వాళ్లకు నేను రష్మిక ఎందుకు భయపడాలనే విజయ్ దేవరకొండ ప్రశ్నలో లాజిక్ కనిపించింది. డబ్బులు ఖర్చు పెట్టి ఆర్గజైడ్ గా చేస్తున్న నెగటివ్ పబ్లిసిటీని ఏ మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని కుండ బద్దలు కొట్టేశాడు. ఎవరికో నచ్చలేదని, అరగలేదని నేను ఇంట్లో కూచోవాలా అంటూ వేసిన సెటైర్ అభిమానులతో చప్పట్లు కొట్టించుకుంది. విజయ్ కూల్ గా జబాబులు చెప్పడం బాగుంది.
సైరా నరసింహారెడ్డి పోలిక గురించి దర్శకుడు రాహుల్ మాట్లాడుతూ అది కేవలం ఒక వీరుడి కథతో రూపొంది అందులో మెగాస్టార్ చిరంజీవి నటించడం చాల సంతోషం కలిగించిందని, అయితే రణబాలి చరిత్రలో బయటికి తెలియని వీరులని స్ఫూర్తిగా తీసుకుని అల్లుకుందని స్పష్టత ఇచ్చారు. ఇరుముడి తరహాలో దీనికి కూడా ప్రీమియర్లు వేయడం లేదని అదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తామని నిర్మాతలు రవి శంకర్, నవీన్ యెర్నేని చెప్పడంతో ముందు రోజు షోలు లేవని అర్థమైపోయింది.
ఇవే కాదు నార్త్ అమెరికాలో బుకింగ్స్ నెమ్మదిగా ఉండటం, మూడు గంటల లెన్త్ గురించి చూస్తున్న డిస్కషన్, విజయ్ దేవరకొండ మీద జరుగుతున్న నెగటివిటీ ఇవన్నీ ప్రెస్ మీట్ లో ప్రస్తావనకు వచ్చాయి. మొత్తానికి రణబాలి కోరుకున్న మూమెంట్ ట్రైలర్ నుంచి పెరిగేలా ఉంది. ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా కథేంటో ముందే చెప్పేయడం ద్వారా ప్రేక్షకులను ప్రిపేర్ చేయడం మంచి ఆలోచన. అసలే రజనీకాంత్ జైలర్ 2తో పోటీ ఉంది. దాన్ని ధీటుగా ఎదురుకోవడం విజయ్ దేవరకొండకు సవాలే.
This post was last modified on October 8, 2026 10:38 pm
బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…
విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…
అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…
ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…
ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…
ఎంత పెద్ద స్టార్ హీరోకైనా డిజాస్టర్లు సహజం. ఎన్టీఆర్ ఎంజిఆర్ నుంచి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ అనుభవమే.…