ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం చేసుకోబోతోంది. ఇన్నాళ్లు అసలు వస్తుందో రాదో, ఓటిటికి ఇస్తారేమో అని రకరకాల ప్రచారాలు జరిగాక ఫైనల్ గా వాటికి చెక్ పెడుతూ లైకా సంస్థ ప్రకటన ఇచ్చింది. వార్ బిగిన్స్ అంటూ కొత్త క్యాప్షన్ తో త్వరలోనే మీ ముందుకు వస్తామని అందులో పేర్కొంది. కమల్ హాసన్, ప్రొడక్షన్ హౌస్ మధ్య ఉన్న గ్యాప్ ని ఉదయనిధి స్టాలిన్ మధ్యవర్తిత్వంతో పరిష్కారం చేశారని చెన్నై టాక్.
సరే బాగానే ఉంది కానీ భారతీయుడు 3కి నిజంగా క్రేజ్ వస్తుందా అంటే మటుకు ఔనని సమాధానం చెప్పలేం. ఎందుకంటే రెండో భాగం జెన్ జీ ఆడియన్స్ ని తీవ్రంగా నిరాశ పరచడమే కాదు ఏకంగా లోకనాయకుడుని ట్రోలింగ్ బారిన పడేలా చేసింది. శంకర్ దర్శకత్వ ప్రతిభ, అనిరుధ్ రవిచందర్ సంగీతం, సిద్దార్థ్ లాంటి ఆర్టిస్టుల నటన ఒకదాన్ని మించి మరొకటి అత్తెసరుగా ఉండటం ఘోరంగా దెబ్బ కొట్టింది. చెప్పాలంటే 1996 క్లాసిక్ కి తీరని అవమానం మిగిలింది.
ట్విస్ట్ ఏంటంటే అసలు కథంతా భారతీయుడు 3లో ఉంటుంది. సేనాపతి స్వాతంత్రం రాకముందు ఏమేం పోరాటాలు చేశాడు, బ్రిటిషర్లను ఎలా ఎదిరించాడు లాంటి వాటిని కొత్తగా రాసుకుని డిజైన్ చేశారు. షూటింగ్ కూడా ఎప్పుడో అయిపోయింది. కేవలం బిజినెస్ ఎక్కువ జరగాలనే అత్యాశతో అనవసరంగా ఇండియన్ 2 వచ్చేలా చేశారు కానీ, అసలు సేనాపతి పోరాటాన్ని నేరుగా రెండో భాగంలో చూపించి ఉంటే ఇవాళ ఇంత దయనీయ పరిస్థితి వచ్చేది కాదు. డిసెంట్ ఫలితం దక్కేది.
కోలీవుడ్ వర్గాల ప్రకారం భారతీయుడు 3 సంక్రాంతి రేసులో ఉండేలా చూస్తున్నారట. రజనీకాంత్ ధర్మన్ ఆల్రెడీ అదే ప్లాన్ లో ఉండగా అది వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయన్న ఆలోచనతో లైకా సంస్థ ఈ ప్లాన్ లో ఉందని తెలిసింది. ఓటిటి సంస్థకు కూడా ముందే చూపించి డీల్ సెట్ చేసుకోవచ్చని అంటున్నారు. అనిరుధ్ ఈసారైనా నిరాశ పరచకుండా బెస్ట్ అవుట్ ఫుట్ ఇస్తే విక్రమ్ లాగా కమల్ ఫ్యాన్స్ పదే పదే తలుచుకునే జ్ఞాపకం అవుతుంది. మరి సేనాపతి ఆ ఆశలను నెరవేరుస్తాడో లేదో.
This post was last modified on October 8, 2026 5:29 pm
ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…
ఎంత పెద్ద స్టార్ హీరోకైనా డిజాస్టర్లు సహజం. ఎన్టీఆర్ ఎంజిఆర్ నుంచి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ అనుభవమే.…
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు…
ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…
స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…