2024 ఎన్నికల కోసం సినిమాలకు విరామం ఇచ్చిన పవన్ కళ్యాణ్, గత ఏడాది కాస్త వీలు చేసుకుని పెండింగ్‌లో ఉన్న మూడు సినిమాలనూ చకచకా పూర్తి చేసేయడం.. అందులో రెండు (హరిహర వీరమల్లు, ఓజీ) గత ఏడాది.. ఇంకోటి (ఉస్తాద్ భగత్ సింగ్) ఈ ఏడాది రిలీజ్ కావడం తెలిసిందే. ఈ మూడూ అయిపోయాక పవన్ ఫోకస్ పూర్తిగా రాజకీయాల మీదే ఉంటోంది.
పవన్ మళ్లీ సినిమా చేద్దామని అనుకుంటున్నాడు కానీ.. అదెప్పుడు అన్నది క్లారిటీ లేదు. సురేందర్ రెడ్డి సినిమా ముందుకు కదిలినట్లే కదిలి ఆగిపోయింది. ఓజీ-2ను ఓకే చేసినా.. అది ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ప్రస్తుతం పవన్ అయితే ఏ సినిమాలోనూ నటించట్లేదన్నది స్పష్టం. కానీ ఆయన మిస్సైల్ పేరుతో ఒక సినిమా చేసినట్లు, అది విడుదలైనట్లు అమలాపురంలో కటౌట్, ఫ్లెక్సీ పెట్టేయడం చూసి అక్కడి జనాలు అవాక్కయిపోయారు.
అమలాపురంలోని వెంకట రమణ పిక్చర్ ప్యాలెస్ అనే థియేటర్ ముందు పవన్‌ది పెద్ద కటౌట్‌తో పాటు, ఫ్లెక్సీలు కూడా పెట్టారు అభిమానులు. ఆ ఫ్లెక్సీలో మిస్సైల్ అనే సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఐతే పవన్ దాదాపు ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిన వాళ్లంతా ఈ సినిమా ఎప్పుడు తీశారు.. ఎవరు రిలీజ్ చేస్తున్నారు అంటూ ఆశ్చర్యపోతున్నారు.
కొందరు అభిమానులైతే ఆసక్తితో థియేటర్ వద్దకు వచ్చి అసలేం జరుగుతోంది ఇక్కడ అంటూ ఆరాలు తీస్తున్నారు. ఈ విషయాన్ని కొన్ని టీవీ ఛానెళ్లు, వెబ్ సైట్లు రిపోర్ట్ చేయడంతో పవన్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. కానీ ఎవరో కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహంతోనే ఇదంతా చేశారని అర్థమై లైట్ తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో మాత్రం దీని మీద ఇదెప్పుడు పెట్టారు అనే బ్రహ్మి మీమ్ పెట్టి కామెడీ చేస్తున్నారు. ఇది చూసి ఎవరో ఒకరు మిస్సైల్ పేరుతో సినిమా తీసినా తీస్తారనే కామెంట్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో.
This post was last modified on November 21, 2026 12:58 pm
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు.. టాలీవుడ్ స్టార్ హీరోలు చాలామంది మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.…
కల్వకుంట్ల కవిత...ఈ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చే మరో పేరు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ సాధనలో…
మూడేళ్ళ క్రితం మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సంక్రాంతి రేసులో తలపడి తేజ సజ్జ అంత…
కొన్ని రోజుల ముందు ‘అక్క’ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఒక చిట్ చాట్‌లో.. రాధిక ఆప్టే తెలుగు…
ఏపీ బీజేపీలో కొన్నాళ్లుగా అసంతృప్తితోనే నాయకులు ముందుకు సాగుతున్నారు. పార్టీలో ఏం జరుగుతోందో.. తమకు అర్థం కావడం లేదని కొన్నాళ్లుగా…
భారతదేశ పారిశ్రామిక రంగంలో ఆంధ్ర ప్రదేశ్ దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ ప్రెస్ బుల్లెట్ వేగంతో ముందుకు దూసుకొని…