Movie News

అది ప్యారడైజ్ కాకి కాదు

ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం పట్టదు. ఐతే కామెడీ సినిమాల్లో ఇన్ డైరెక్ట్ పంచులు వేయడం.. స్పూఫులు, పేరడీలు చేయడం మామూలే కాబట్టి ఎవరో ఒకరు టార్గెట్ అవుతూనే ఉంటారు. ఇలాంటి వాటిని కొందరు సరదాగా తీసుకుంటారు. కొందరు సీరియస్ అయిపోతుంటారు.

‘కొరియన్ కనకరాజు’ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ మీద చేసిన చిన్న స్పూఫ్ ఎంత వివాదానికి దారి తీసిందో తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీం.. ఈ సినిమా ట్రైలర్ చివర్లో పెట్టిన ఒక షాట్ చర్చనీయాంశం అయింది.

అందులో తుపాకీ దెబ్బకు చెట్టు మీద నుంచి కింద పడే కాకిని చూపించారు. సత్య అది చూసి ‘కౌంజు పిట్టను కొడితే కాకి పడింది’ అంటాడు. ఈ డైలాగ్ ‘ది ప్యారడైజ్’ సినిమాకు పంచ్ అంటూ సోషల్ మీడియాలో చిన్న వివాదం మొదలైంది. అందులో హీరో అండ్ కో తమను తాము కాకులతో ఐడెంటిఫై చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. సినిమాలా చాలా చోట్ల కాకులతో ముడిపడ్డ సన్నివేశాలుంటాయి. ఐతే ఈ సినిమా ఫ్లాప్ అయిన నేపథ్యంలో దాని మీద ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీం పంచ్ వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ ప్రచారంపై ‘కామ్రేడ్ కళ్యాణ్’ ప్రెజెంటర్, సీనియర్ రైటర్ కోన వెంకట్ స్పందించాడు. ‘‘అది ప్యారడైజ్ కాకి అనుకున్నారు కదా. అదేం కాదు. ఆ కాకులు వేరు. ఈ కాకులు వేరు. దీన్ని ఎవరో కావాలనే కాంట్రవర్శీ చేశారు. ప్యారడైజ్ సినిమా రావడానికి ముందే కాకులు ఉన్నాయి. మా సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది’’ అని ఆయన వివరణ ఇచ్చారు.

మరోవైపు అక్టోబరు 9న రావాల్సిన ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా పడడం గురించి ప్రస్తావించి, ఆ సినిమా పోస్ట్‌పోన్ అవుతుందని మీకు ముందే హింట్ వచ్చిందా, అందుకే 9వ తేదీకి చిత్రాన్ని వేసుకున్నారా అని కోనను అడిగితే.. ‘ఆదర్శ కుటుంబం’కి ముందు ప్రకటించిన డేట్ అక్టోబరు 2న అని, అప్పుడు తాము 9వ తేదీకి రావాలనుకున్నామని.. తర్వాత ‘ఆదర్శ కుటుంబం’ 9వ తేదీకి వాయిదా పడడంతో శ్రీ విష్ణు తన ఫేవరెట్ హీరో మూవీతో పోటీ పడడం ఎలా అని సందేహించాడని, కానీ పండుగ సీజన్ కాబట్టి రెండు సినిమాలకూ స్కోప్ ఉంటుందని అతణ్ని ఒప్పించామని కోన తెలిపాడు.

ఐతే అనుకోకుండా ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా పడడం తమకు కలిసొచ్చిందని ఆయనన్నాడు. ఇక ‘అదుర్స్-2’ గురించి అడిగితే.. ఎప్పట్లాగే ఆ సినిమా తప్పకుండా ఉంటుందని అన్నాడు కోన. మూడు రోజుల ముందే తారక్ తనకు ఫోన్ చేశాడని, ఈ వీకెండ్ కలుద్దామన్నాడని, అతణ్ని కలిసినపుడు అందరూ అడుగుతున్నట్లే ‘అదుర్స్-2 ఎప్పుడు’ అనే ప్రశ్న వేస్తానని కోన తెలిపాడు.

This post was last modified on October 8, 2026 8:38 pm

Share

Recent Posts

యష్ బయటికి వచ్చే టైమయ్యింది

ఎంత పెద్ద స్టార్ హీరోకైనా డిజాస్టర్లు సహజం. ఎన్టీఆర్ ఎంజిఆర్ నుంచి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ అనుభవమే.…

11 minutes ago

నేరుగా సుప్రీం వద్దకు ఎలా వస్తారు?

రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు…

41 minutes ago

జిమ్ జిమ్ తార అంటూ మెడికోల నిరసన

ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…

2 hours ago

వంగా, జక్కన్న ఫెయిల్… నీల్ అయినా నిలబెడతాడా!

స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…

2 hours ago

నాని నిర్ణయం రిస్క్ అవుతుందా

ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…

3 hours ago

అదుర్స్ కొనసాగింపు కుదరదని తెలిసినా

కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…

4 hours ago