Movie News

మెగాస్టార్ లిస్టులో వద్దనుకున్న పేరుందా

కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి ఇప్పటిదాకా ఫైనల్ చేయలేదు. రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఏది కన్ఫర్మ్ చేస్తారో అర్థం కాక ఫ్యాన్స్ మెదళ్ళకు పని చెబుతున్నారు. ఆల్రెడీ ప్రకటించిన శ్రీకాంత్ ఓదెల మూవీ ఇప్పట్లో సెట్స్ కు వెళ్లే ఛాన్స్ లేదని నాని తెగేసి చెప్పడంతో దీని మీద ఆశలు పెట్టుకుని లాభం లేదు. చూస్తుంటే అసలెప్పటికీ కార్యరూపం దాల్చకపోవచ్చేమో.

పెద్ది మేకింగ్ నచ్చి బుచ్చిబాబుకో కథ రాయమని మెగాస్టార్ గతంలోనే పురమాయించారట. శరీర భాగాలు కట్ చేయడం, ఓవర్ ఎమోషన్స్ లేకుండా ఒక ప్రాపర్ కమర్షియల్ సబ్జెక్టు సిద్ధం చేయమని చెప్పారని ఇన్ సైడ్ టాక్. బుచ్చిబాబు బృందం ప్రస్తుతం అదే పనిలో ఉంది. నెరేషన్ తో మెప్పిస్తే మటుకు షూటింగ్ కు వెళ్ళడానికి ఎక్కువ రోజులు పట్టదు. ఎందుకంటే జనవరి రెండో వారం నుంచి చిరంజీవి ఫ్రీ అయిపోతారు. డేట్స్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉంది.

అయితే తాజాగా కళ్యాణ్ కృష్ణ పేరు కూడా మెగా కాంపౌండ్ లో వినిపిస్తోంది. నిజానికి భోళా శంకర్ కు ముందు చిరు ఓకే చేసింది ఇతన్నే. ఆ మేరకు సబ్జెక్టు కూడా రెడీ అయ్యింది. అన్నీ ఓకే అనుకుంటే మన శంకరవరప్రసాద్ గారు కన్నాముందు నిర్మాతగా సుస్మిత కొణిదెల ఈ సినిమాకే వ్యవహరించేవారు. కానీ డ్రాప్ అయ్యారు. అదే కథనే సందీప్ కిషన్ మజాకాగా త్రినాథరావు తీశారని అప్పట్లో వినిపించింది. వాస్తవాలు అవాస్తవాలు ఏమైనా ఈ కాంబో పట్టాలు ఎక్కపోవడాన్ని ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు.

ఒకవేళ నిజంగా అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే కళ్యాణ్ కృష్ణ కొత్త కథ రాసుకున్నారేమో చూడాలి. బంగార్రాజు సీక్వెల్ తీయాలని నాగార్జున రెండేళ్లుగా అనుకుంటూనే ఉన్నారు. కానీ ,కుదరటం లేదు. సోగ్గాడే చిన్ని నాయనా లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణకు ఇంత గ్యాప్ రావడం విచిత్రమే. రవితేజ నేల టికెట్ డిజాస్టర్ కావడం బాగా దెబ్బ కొట్టింది. కళ్యాణ్ కృష్ణ నాలుగేళ్ళ నుంచి ఖాళీగానే ఉన్నారు. మరి ఛాన్స్ ఎవరు ఇస్తారో ఎప్పుడు మొదలుపెడతారో కాలమే సమాధానం చెప్పాలి.

This post was last modified on October 8, 2026 1:23 pm

Share

Recent Posts

మత రాజకీయమే మార్గమా సాయిరెడ్డి?

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…

46 minutes ago

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

4 hours ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

6 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

7 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

7 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

8 hours ago