‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ తీయాలనుకున్నపుడు అది ఒక చిత్రంగానే మొదలైంది. కానీ షూటింగ్ బాగా ఆలస్యం కావడం, బ్రేకులు పడడం, బడ్జెట్ పెరిగిపోవడం.. ఇదంతా జరిగాక దీన్ని రెండు భాగాలుగా తీసుకురావాలని అనుకున్నారు మేకర్స్. అందుకోసం కథను సాగదీశారు. ఏవేవో ఎలిమెంట్స్ జోడించారు. చివరికి రెండేళ్ల ముందు సీక్వెల్స్‌లో మొదటిదైన ‘ఇండియన్-2’ రిలీజైంది.
చివరి వరకు కూర్చోవడం కూడా కష్టమయ్యే స్థాయిలో ఆ సినిమా ప్రేక్షకులకు చుక్కలు చూపించిందా సినిమా. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద డిజాస్టర్లలో అదొకటిగా నిలిచింది. దీంతో ‘ఇండియన్-3’కి బ్రేక్ పడిపోయింది. దానికి సంబంధించి చాలా వరకు చిత్రీకరణ జరిగినప్పటికీ.. ఇంకా కొంత శాతం దాకా షూట్ మిగిలే ఉంది. అవన్నీ భారీ యాక్షన్ ఘట్టాలే. శంకర్, కమల్, నిర్మాతల మధ్య ఏకాభిప్రాయం కుదరక సినిమా ముందుకు కదల్లేదు
ఐతే ఎట్టకేలకు ‘ఇండియన్-3’ బ్యాలెన్స్ షూట్‌ను మొదలుపెట్టారు. నిన్న ‘ఇండియన్-3’ అప్‌డేట్ గురించి లైకా సంస్థ సోషల్ మీడియా పోస్టు పెడితే నేరుగా రిలీజ్ డేట్ ఇస్తారేమో అనుకున్నారు. కానీ జస్ట్ షూటింగ్ మొదలవుతున్నట్లు చెప్పడంతో సోషల్ మీడియాలో పెద్దగా చలనం కనిపించడం లేదు. ఇంకప్పుడు షూటింగ్ చేయాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి అంటూ నిట్టూరుస్తున్నారు. అయినా భారీ డిజాస్టర్ అయిన సినిమాకు ఇంకో సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో ఏం ఆసక్తి ఉంటుంది. ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ డిజాస్టర్ అయ్యాక ‘మహానాయకుడు’ విషయంలో ఏమాత్రం ఎగ్జైట్మెంట్ కనిపించలేదు. ముందే ఆ సినిమా డిజాస్టర్ అనే నిర్ణయానికి వచ్చేశారు.
‘ఇండియన్-3’ విషయంలోనూ ఇలాంటి ఫీలింగే ఉంది. ఐతే నిజానికి ‘ఇండియన్-3’లో మంచి కంటెంటే ఉంటుందని.. ఈ కథను రెండు భాగాలు చేసి, ముందు భాగాన్ని సాగదీయడం వల్ల అసలుకే మోసం వచ్చిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. కమల్ కూడా తాను ‘ఇండియన్’కి సీక్వెల్ చేయాలనుకోవడానికి ‘ఇండియన్-3’లోని కంటెంటే కారణమని కూడా చెప్పారు. మరి ఆ ప్రకారం ఇది బెటర్ కంటెంట్‌తో వచ్చి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుందేమో చూడాలి. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on October 8, 2026 9:17 pm
ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…
ఎంత పెద్ద స్టార్ హీరోకైనా డిజాస్టర్లు సహజం. ఎన్టీఆర్ ఎంజిఆర్ నుంచి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ అనుభవమే.…
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు…
ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…
స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…